అమరావతి: కూటమికి వరం, వైసీపీకి శాపం?

Amaravati capital city development progress

‘ఇది మా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి’ అని రాష్ట్ర ప్రజలందరూ సగర్వంతో చెప్పుకునేలా చేయాల్సిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నిర్దాక్షిణ్యంగా ఐదేళ్ళపాటు పాడు బెట్టేశారు.

లక్షల కోట్లు విలువ చేసే భవన సముదాయాలు, భూములు, వాటిని అభివృద్ధి చేసేందుకు చేసిన ఖర్చు, శ్రమ అంతా వృధా చేశారు. అన్నిటికీ మించి ఐదేళ్ళ విలువైన సమయం వృధా చేశారు.

ADVERTISEMENT

అంతేకాదు.. భవిష్యత్‌లో ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతి నిర్మించే పరిస్థితి లేకుండా చేసేందుకు ఏమేమి చేయాలో అన్నీ చేశారు.

ఈ కారణంగా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు వెనక్కు వెళ్ళిపోయాయి. భూములిచ్చిన రైతులకు అవమానాలు, ఛీత్కారాలు, కన్నీళ్ళే మిగిలాయి. ఇవన్నీ ప్రజలకు తెలిసిన విషయాలే.

ఇలాంటి దయనీయ పరిస్థితిలో ఉన్న అమరావతి పునరుద్దరణకు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే నడుం బిగించారు.

కేవలం రెండున్నరేళ్ళలో సీడ్ యాక్సిస్ రోడ్‌తో సహా అమరావతిలో ముఖ్య భవన సముదాయాలు చకచకా నిర్మాణం జరుగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగానే రాజధాని అమరావతిలో శరవేగంగా జరుగుతున్న నిర్మాణాలతో ప్రతీ వంద రోజులకు గణనీయమైన మార్పు కనిపిస్తోంది.

మంత్రి నారా లోకేష్‌ ఇదే విషయం తెలియజేస్తూ ‘అమరావతి నాడు-నేడు’ వీడియో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులలో పురోగతిని ఈ వీడియో కళ్ళకు కట్టినట్లు చూపింది.

అయితే ఇప్పటికే పలువురు యూట్యూబర్లు, అమరావతిని చూసేందుకు వస్తున్న ప్రజలు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూనే ఉన్నారు. అవన్నీ వైరల్ అవుతున్నాయి. అంటే రాష్ట్ర ప్రజలు అమరావతి కోసం ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతుంది.

నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పట్ల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోకుండా మూడు రాజధానులు అంటూ తన సొంత ఆలోచనలను ప్రజలపై రుద్దింది. కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకోగలిగిందా?అంటే కాదనే చెప్పాలి. అమరావతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అది చేస్తున్న దుష్ప్రచారమే నిదర్శనం.

కనుక వచ్చే ఎన్నికల్లో అమరావతే కూటమిని మరోసారి గెలిపిస్తే, ఈ దుష్ప్రచారమే వైసీపీ పాలిట శాపంగా మారే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories