భలే ఓరండి నాగబాబుగారు… నా బొమ్మేసినందుకు థాంక్స్

ambati rambabu counter to nagababu tweetజనసేనాని పవన్‌ కళ్యాణ్‌ చేనేత దుస్తుల ఛాలెంజ్‌లపై మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ “ఎప్పుడూ ఆ చేనేత గోలేనా?వచ్చే ఎన్నికలలో మీ పార్టీ 175 స్థానాలలో పోటీ చేస్తుందా లేదో చెపుతారా?” అంటూ వ్యంగ్యంగా అడిగారు.

దానిపై పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు నాగబాబు ట్విట్టర్‌లో స్పందిస్తూ, “ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా! బాబూ… ఓ రాంబాబు… జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్‌కి, వైసిపి సర్కస్‌లో నీలాంటి బఫూన్‌గాళ్ళు అడిగే క్లారిఫికేషన్స్‌కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జనసైనికులకి లేదు. మా ప్రెసిడెంట్ గారికి అంతకంటే లేదు,” అంటూ మంత్రి అంబటి రాంబాబుని బఫూన్‌లా చిత్రీకరించిన ఫోటోను జోడించారు.

ADVERTISEMENT

అయితే నోరు తెరిస్తే వెటకారంగా మాట్లాడే దురలవాటున్న మంత్రి అంబటి రాంబాబు కూడా తన స్టైల్లో స్పందిస్తూ, “భలే ఓరండి నాగబాబు గారు ఎంత ఓపిగ్గా ఎంత తీరిగ్గా నా బొమ్మేసారండి ఖాళీగా ఉన్నట్లున్నారు, ధన్యవాదాలు! @ నాగబాబు ఆఫ్ అని వ్యంగ్యంగా సమాధానం చెప్పారు.

నాగబాబు తనను సర్కస్ బఫూన్‌ అన్నప్పటికీ మంత్రి అంబటి రాంబాబు నొచ్చుకోకుండా ఈవిదంగా సమాధానం చెప్పడం అభినందనీయమే.

అయితే వచ్చే ఎన్నికలలో జనసేన 175 సీట్లకు పోటీ చేస్తుందా లేదా? అని అంబటి రాంబాబు ఎందుకు అడిగారంటే టిడిపి, బిజెపిలతో పొత్తులు పెట్టుకొంటుందో లేదో తెలుసుకోవడానికే!అందుకే నాగబాబు “ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా! బాబూ… ఓ రాంబాబు…” అంటూ ఎదురు ప్రశ్నించారు. అయినా వచ్చే ఎన్నికలలో 175 సీట్లు వైసీపీ గెలుచుకొంటున్నప్పుడు ఇక ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తే వైసీపీకి ఎందుకో?

ADVERTISEMENT
Latest Stories