కేంద్రంతో కటీఫ్‌.. జగన్‌ సిద్దపడుతున్నట్లేనా?

Jagan BJP Relations and YSRCP Political Shift

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్‌ ప్రక్రియలో టీడీపి గూండాయిజం చేసిందని ఆరోపించారు. ఓటమి భయంతోనే టీడీపి వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడిందన్నారు. ఇప్పుడు అన్యాయంగా వ్యవహరిస్తున్న ప్రతీ ఒక్క అధికారి, టీడీపి నేతలకు తాము అధికారంలోకి వచ్చాక మూల్యం చెల్లించాల్సి వస్తుందని జగన్‌ హెచ్చరించారు.

కాస్త అటూ ఇటూగా ఇవన్నీ రోజూ చెప్పే మాటలే. అయితే ప్రతీ అంశంలో కేంద్రానికి మద్దతు ఇచ్చి చాలా తప్పు చేశామని జగన్‌ చెప్పడం ఆలోచింపజేస్తుంది.

ADVERTISEMENT

అయన బిజేపితో పొత్తు పెట్టుకోనప్పటికీ, కేంద్రంతో సఖ్యతగా ఉన్నామని ఇప్పుడు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఎందుకో అందరికీ తెలుసు.

ఇది వరకులా వైసీపీ కుట్రలు, కుతంత్రాలతో బిజేపి-టీడీపి బంధం చెక్కు చెదరకపోగా ఇంకా బలపడింది. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుం డటమే ఇందుకు నిదర్శనం. మరోపక్క జగన్‌ అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసుల విచారణ కూడా వేగవంతం అయ్యింది. ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి తీవ్ర అసహనం కలిగించడం సహజం.

కనుక ప్రధాని మోడీ పట్ల ఇంకా ఎంత కాలం వినయంగా ఉన్నా ప్రయోజనం ఉండదని జగన్మోహన్ రెడ్డికి అర్దమైనట్లే ఉంది. నేడు ప్రెస్‌మీట్‌లో ఈసీతో పాటు మోడీ ప్రభుత్వాన్ని కూడా వేలెత్తి చూపడం ద్వారా జగన్‌ తన అసహనాన్ని బయటపెట్టారు.

అంతేకాదు తాను ఇండియా కూటమితో చేతులు కలిపేందుకు సిద్దమవుతున్నట్లు ఇప్పటికే ట్వీట్స్ ద్వారా కేంద్రానికి తొలి సంకేతాలు పంపారు. నేడు మరోసారి సంకేతం పంపినట్లే భావించవచ్చు.

ఒకవేళ ఈ కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలకు బ్రేకులు వేసి ఉండి ఉంటే, నేడు ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను నిందించడంతో సరిపెట్టి ఉండేవారు కదా?

ADVERTISEMENT
Latest Stories