సంబరాల రాంబాబుకి సరైన జోడినే జనసేన సెట్ చేస్తోందిగా!

Ambati_Rambabu_Kanna_Lakshminarayanaఏపీ జలవనరుల శాఖ మంత్రి ఎవరనే ప్రశ్నకి చాలామంది సమాధానం చెప్పలేకపోవచ్చు కానీ సంబరాల రాంబాబు ఎవరంటే అంటే టక్కున సమాధానం చెప్పగలరు.

మంత్రిగా కంటే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌లపై వ్యంగ్యంగా విమర్శించడం అంబటి రాంబాబు ఎప్పుడూ ముందుంటారు. మొన్న సంక్రాంతి పండుగకి సత్తెనపల్లిలో రోడ్డుపై ఆయన చేసిన డ్యాన్సు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలుసు.

ADVERTISEMENT

కనుక జనసేన పార్టీ సత్తెన్నపల్లిలో ఆయనకి సరైన జోడీని సెట్ చేస్తోంది. రాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ జనవరి 26న జనసేన పార్టీలో చేర్చుకొని సత్తెనపల్లి నుంచే సంబరాల రాంబాబుపై పోటీకి దించబోతున్నట్లు తాజా సమాచారం.

గత కొంతకాలంగా కన్నా లక్ష్మినారాయణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పనితీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ని ప్రశంశిస్తూ జనసేనకి దగ్గరవుతున్నారు కూడా. కొన్ని రోజుల క్రితమే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌తో భేటీ అయినప్పుడు సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు కన్నా లక్ష్మినారాయణ సంసిద్దం వ్యక్తం చేసిన్నట్లు సమాచారం.

జనసేన-టిడిపిలు పొత్తులు పెట్టుకోబోతున్నందున సత్తెన్నపల్లి నియోజకవర్గాన్ని జనసేనకి కేటాయించేందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించిన్నట్లు సమాచారం. జనవరి 26న కన్నా లక్ష్మినారాయణ జనసేనలో చేరాక దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది. ఒకవేళ కన్నా లక్ష్మినారాయణ వచ్చే ఎన్నికలలో జనసేన అభ్యర్ధిగా సత్తెనపల్లి నుంచి బరిలో దిగితే సంబరాల రాంబాబు ఇంకా హుషారుగా డ్యాన్స్ చేయాల్సి రావచ్చు.

ADVERTISEMENT
Latest Stories