ఆన్ లైన్ లో విడుదల చేసినా అంత ఈజీ కాదు

Amrutharamam -Telugu -Movie Review talk-కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సినిమా హాళ్ళు మూతపడ్డాయి… షూటింగ్లు ఆగిపోయాయి. ఎప్పుడు సాధారణ స్థితి వస్తుంది అనే దాని మీద ఎవరికీ ఐడియా లేదు. ప్రభుత్వాలు కొద్ది రోజుల తరువాత సడలింపులు ఇచ్చినా సినిమా హాళ్ళు తెరవడం అనేది వారి లిస్టు చివరలో ఉంటుంది.

దీనితో చేసేది ఏమీ లేక… వడ్డీలు పెంచుకోవడం ఇష్టం లేక… చిన్న, మీడియం చిత్రాల నిర్మాతలు తమ సినిమాలను డైరెక్టుగా ఆన్ లైన్ లో విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. దీనితో వారి పెట్టుబడి వెనక్కు రాకపోయినా ఎంతో కొంతకి అమ్ముకోవడమే మేలు అన్నట్టు ఉంది వారి ఆలోచన.

ADVERTISEMENT

ఈ ప్రకారం తెలుగులో అమృతారామమ్ అనే సినిమా, తమిళంలో ఆర్కే నగర్ అనే సినిమా ఈరోజు డైరెక్టుగా ఆన్ లైన్ లో రిలీజ్ అయ్యాయి. అమృతారామమ్ పూర్తిగా కొత్త వారితో తీసిన సినిమా కాగా, అర్కే నగర్ సీనియర్ దర్శకుడు కోదండరామి రెడ్డి కుమారుడు వైభవ్ హీరోగా నటించాడు. అమృతారామమ్ జీ5లో విడుదల కాగా… ఆర్కే నగర్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది.

అయితే ఈ రెండు సినిమాలకు నెగటివ్ రివ్యూలు రావడం గమనార్హం. ఇటువంటి తరుణంలో ఓటీటీలకు కూడా నష్టమే. సినిమాలు సక్సెస్ అయ్యి కాసులు వస్తేనే వారు మరిన్ని సినిమాలు బెటర్ రేటు ఇచ్చి కొనే అవకాశం ఉంటుంది. ఈ తరహా సినిమాలకు ఓటీటీలు కొంత డౌన్ పేమెంట్ చేసి, ఆ తరువాత వ్యూ కి ఇంత అని నిర్మాతలకు పే చేస్తారు. సినిమాలకు నెగటివ్ రివ్యూలు వస్తే… ఆ డబ్బు కూడా రాదు.

ADVERTISEMENT
Latest Stories