మిడిల్ క్లాస్ మెలోడీస్ పాడబోతున్న దేవరకొండ తమ్ముడు

Anand Deverakonda Cursing China for Conspiracyవిజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం దొరసానితో తొలిసారిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు, అతని రెండవ సినిమా కూడా ప్రకటించబడింది. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ పేరుతో ఉన్న ఈ మూవీకి వినోద్ అనంతోజు అనే కొత్త అతను దర్శకత్వం వహించనున్నారు.

ఈ చిత్రంలో ఆనంద్ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ ఏడాది విడుదలైన చూసి చూడంగానే అనే సినిమాతో ఆమె తెలుగులో అరంగేట్రం చేసింది. కేర్ ఆఫ్ కాంచరపాలెం కోసం సంగీతం స్కోర్ చేసిన స్వీకర్ అగస్తి ఈ చిత్రానికి సంగీత కంపోజర్. వెనిగల్ల ఆనంద్ ప్రసాద్ తన భవ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ADVERTISEMENT

ఆనంద్ ప్రసాద్ ఎక్కువగా గోపీచంద్ తో సినిమాలు చేసే వారు. ఆయన చివరిగా బాలయ్య, పూరి జగన్నాధ్ తో పైసా వసూల్ సినిమాని నిర్మించారు. కరోనా క్రైసిస్ కొంత తగ్గిన తరువాత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. ఆనంద్ తన మొదటి చిత్రం తర్వాత చాలా విరామం తీసుకొని ఈ స్క్రిప్ట్‌తో తిరిగి వచ్చాడు.

వస్తున్న రిపోర్టులను బట్టి ఆనంద్ ఈ సమయంలో తన వయస్సు మరియు బాడీ లాంగ్వేజ్ కు తగిన సరైన స్క్రిప్ట్ ని ఎంచుకున్నాడు. ఈ కరోనా బ్రేక్ తో సినిమా కోసం సిద్ధం కావడానికి అతనికి ఎక్కువ సమయం లభిస్తుంది. మరి ఈ రెండో చిత్రంతో అతను హిట్ కొడతాడేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories