వైరల్ అవుతోన్న పోస్టర్… కారణం ఉంది..!

Anando Brahma Poster copied from Ek Thi Daayan‘భలే మంచి రోజు’ వంటి సూపర్ హిట్ తర్వాత, అదే నిర్మాణ సంస్థ నుండి వస్తున్న “ఆనందో బ్రహ్మా” సినిమా ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ మరియు ‘మోషన్ పిక్చర్’తో వీక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆగష్టు 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నాము అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టర్, ఓ బాలీవుడ్ సినిమాకు కాపీ పోస్టర్ లా దింపేయడంతో, అది కాస్త వైరల్ గా మారింది.

2013లో ఇమ్రాన్ హష్మి, హుమా కురెశి, కొంకణ సేన్ శర్మ, కల్కి కోయేచిన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “ఏక్ తి దాయన్” సినిమా పోస్టర్ ను యాజిటిజ్ గా కాపీ చేస్తూ రూపొందించిన “ఆనందో బ్రహ్మా” పోస్టర్ పై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఇప్పటివరకు “ఆనందో బ్రహ్మా” సినిమాపై ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్స్ ఉండగా, తాజాగా వెలుగులోకి వచ్చిన కాపీ పోస్టర్ తో, కేవలం పోస్టర్ ఒక్కటే కాపీనా? లేక సినిమా కూడానా? అన్న సందేహాలు సగటు సినీ ప్రేక్షకులలో వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories