ఫైనల్ గా ‘మెగా’ మూవీలో ల్యాండ్ అయ్యింది!

Anasuya Bharadwaj in Ram Charan Movieబుల్లితెరపై చిట్టిపొట్టి కాస్ట్యూమ్స్ తో పాటు, హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ పలికిస్తూ యువ హృదయాలను కొల్లగొట్టిన ‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ గురించి తెలియనిదెవరికి! ఒక విధంగా ఇలా పాపులర్ కాగా, ఏకంగా పవన్ కళ్యాణ్ పక్కన ఓ పాటలో అవకాశం వస్తే తిరస్కరించిందని మరో రకంగా విపరీతమైన పబ్లిసిటీ తెచ్చుకుంది. అలాగే ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమాలోనూ అవకాశం వస్తే, చేయనని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఇలా వరుసగా మెగా హీరోలను పక్కన పెడుతోందని అనసూయ పేరు అప్పట్లో హాట్ హాట్ గా వినపడింది.

అయితే పవన్ సినిమా అవకాశం వచ్చిన సమయంలో తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానని, అందుకే చేయలేకపోయానని అనసూయ వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి వివరణలు ఎన్ని ఇచ్చుకున్నప్పటికీ, మెగా సినిమాలను పక్కన పెడుతోందని అనసూయపై ఓ ముద్ర పడింది. బహుశా ఆ ముద్రను చెరిపివేసుకోవడానికో ఏమో గానీ, ఇటీవల సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన “విన్నర్” సినిమాలో ‘అనసూయ’ పేరుతోనే వచ్చిన ఓ ఐటెం సాంగ్ లో నటించి మెగా అభిమానులను శాంత పరిచింది.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే, ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో అనసూయ ఓ పాటతో పాటు చిన్న రోల్ కూడా చేస్తోందని ప్రచారం జరిగింది. దీంతో మెగా హీరో సినిమాలో అనసూయ కనిపించబోతోందంటూ ట్రేడ్ వర్గాల్లో ఓ టాక్ వినపడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… ప్రచారం జరిగినట్లుగా అనసూయది చిన్న రోల్ కాదని, బాగా గుర్తింపు వచ్చే పాత్రలోనే అనసూయ కనిపించబోతుందని తెలుస్తోంది. మొత్తమ్మీద తను అనుకున్న విధంగా మంచి పాత్రతోనే అనసూయ మరోసారి సిల్వర్ స్క్రీన్ కనిపించబోతుందని ఖరారయ్యింది.

ADVERTISEMENT
Latest Stories