అది నిజమా రంగమ్మత్త..అందుకే కనిపించలేదా?

Anasuya Bharadwaj refutes rumours on her remunerationఅనసూయ భరద్వాజ్…యాంకర్ గా తన కరియర్ మొదలు పెట్టిన ఈ భామ అప్పుడప్పుడు…ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుపులు మెరిపిస్తూ సినిమాల్లో సెటిల్ అయిపోవాలి అని చూస్తుంది. అయితే అంత ఈజీగా అవకాశాలు వస్తే అది సినిమా ఫీల్డ్ ఎందుకు అవుతుంది లెండి. ఇక మన రామ్‌చరణ్ ‘రంగస్థలం’లో మంచి పాత్రలో కనిపించి..’రంగమ్మత్త’గా అందరినీ అలరించింది.

[m9ad]

ADVERTISEMENT

ఇదిలా ఉంటే ఈ మధ్య ఆమెపై లేని పోనీ రూమర్స్ వచ్చాయి. ఆమె జబర్దస్థ్ షో మానేసింది అని, దానికి గల కారణాలు ఏంటి అంటే, రెమ్యునిరేషన్ విషయంలో షో నిర్మాతలకు ఆమెకు కాస్త మాట మాట పెరిగింది అని అందుకే ఆమె రెండు వారాలు కనిపించలేదు అని. ఆ క్రమంలోనే ఆమె స్థానంలో కొత్త యాంకర్ వర్షిని వచ్చింది అని ఉడికీ ఉడకని వార్తలు వండి వార్చింది మీడియా అంతా… కట్ చేస్తే ఆమె ఈ వారం షో లో తళుక్కున మెరిసింది.

అయితే అసలు ఏం జరిగింది అన్న విషయంలోకి కాస్త క్లుప్తంగా వెళితే…అనసూయ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆమె వరుసగా మూడు సినిమాలకు సైన్ చెయ్యడంతో ఆ సినిమా షూటింగ్ కి సంబందించిన డేట్స్ ను ముందుగానే నిర్మాతలు చెప్పింది అని, ఆ రెండు వారాల షో కి తాను ఉండను అని, ముందుగానే చెప్పడంతోనే ఆ స్థానంలో వర్షినిని తీసుకున్నారు అన్నది వారి మాటగా తెలుస్తుంది. మరో పక్క వెండి తెరపై వెలిగిపోవాలి అన్న రంగమ్మత్త ఆశలకు ఈ మూడు సినిమాలు మంచి పునాదిగా నిలబడతాయి అని అనుకోవచ్చు. మరి చూద్దాం ఈ సినిమాలు అనసూయ కరియర్ ని ఎలాంటి మలుపు తిప్పుతాయొ.

ADVERTISEMENT
Latest Stories