సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హాట్ యాంకర్ అనసూయ తాజాగా మరోసారి అభిమానులతో ముచ్చటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ – సుకుమార్ ల “రంగస్థలం” సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న అనసూయ, వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అభిమానులు వేసిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో జవాబిచ్చింది ముద్దుగుమ్మ.
ప్రిన్స్ మహేష్ బాబుతో అవకాశం వస్తే చేస్తారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు… నో చెప్పడానికి తానేం ఫూల్ ని కాదంటూ కుండబద్దలు కొట్టింది. ఇక ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ గురించి అడుగగా… తప్పకుండా చేస్తాను… అంటూ బదులిచ్చింది. అలాగే కింగ్ నాగార్జున సరసన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో నటించిన తాను, మళ్ళీ ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది.
ఈ ప్రశ్నలలో భాగంగా ఓ అభిమాని… ‘మీ ఫేవరేట్ జబ్బు ఏది?’ అంటూ ఓ తుంటరి ప్రశ్న వేయగా, దీనికి అనసూయ అవాక్కైంది. తెలుగు సినిమాను మరింత ఎత్తుకు తీసుకువెళ్ళినందుకు ‘డార్లింగ్’ ప్రభాస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, రామ్ చరణ్ నటించిన సన్నివేశాలు బాగా వచ్చాయని, చెర్రీ చాలా కూల్ పర్సన్ అని, సమంతతో ఈ నెలాఖరున షూటింగ్ చేయనున్నానని అనుభూతులు పంచుకుంది.



