యాంకర్ రవి… నువ్వు వినకుండా మాట్లాడకు..!

Anchor Ravi Fears to talk in Rendu Rellu Aaru Musical Launch“రారండోయ్ వేడుక చూద్దాం” సినీ వేడుక తెలుగు ఇండస్ట్రీకి ఒక పాఠంలా మారిందని చెప్పవచ్చు. ఆ వేడుకలో చలపాయ్ ఉదంతం టాలీవుడ్ ను ఓ కుదుపు కుదపడంతో, ప్రస్తుతం జరిగే ఫంక్షన్లలో మాట్లాడేవారు ఆచితూచి స్పందించాల్సి వస్తోంది. తాజాగా జరిగిన “రెండు రెళ్ళ ఆరు” సినిమా ఆడియో వేడుకలో పరోక్షంగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినీ అంశాలనే ప్రస్తావిస్తూ ఒకరిద్దరూ కౌంటర్లు వేసారు.

ADVERTISEMENT

‘మీ భార్యకు మంచి చేయబోయి అది ఉల్టా అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?’ అంటూ ఫీమేల్ యాంకర్ అతిధులను, సామాన్య ప్రేక్షకులను ప్రశ్నించే భాగంలో… నటుడు నరేష్ ను ఇదే ప్రశ్న అడగగా… ఇప్పుడు మైక్ లలో మాట్లాడాలంటేనే భయమేస్తోంది… ఇటీవల జరిగిన ఒకట్రెండు ఉదంతాలు అలా ఉన్నాయి… అంటూ పంచ్ వేసారు. అలాగే ప్రేక్షకులను కూడా ఇదే ప్రశ్న అడిగిన యాంకర్ కు పలు సమాధానాలు వచ్చాయి.

ఆ క్రమంలో సదరు ప్రశ్నకు జవాబుగా వచ్చిన ‘నా భార్యను పెళ్లి చేసుకోవడమే’ అన్న దానికి యాంకర్ రవి స్పందిస్తూ… ఆయన ‘బాహుబలి’ లాంటోడు గుండె నిండా ధైర్యం ఉంది… అంటూ ప్రశంసలు కురిపించే ప్రయత్నం చేసాడు. దీంతో ఫీమేల్ యాంకర్ మధ్యలో కల్పించుకుని… రవి… నువ్వు వినకుండా మాట్లాడమాకు… మళ్ళీ రచ్చ రచ్చ అయిపోతుంది అని కౌంటర్ వేయగానే అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు.

ADVERTISEMENT
Latest Stories