మాటలతో కాదు… ఈ సారి చేతలతో నవ్విస్తోంది..!

Anchor Suma viral videoసమయస్పూర్తితో మాట్లాడడంలో తెలుగు యాంకర్ సుమని మించిన వారు మరొకరు లేరన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా తన మాటకారితనంతో, తనదైన శైలిలో విసిరే పంచ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమ, తాజాగా సోషల్ మీడియాలో ఐస్‌క్రీమ్‌ తిన్న వీడియోను పోస్ట్ చేసింది. అయితే అది మామూలు ఐస్‌క్రీమ్‌ కాదు…!

ఎంతో చల్లగా ఉండే ఆ ఐస్‌క్రీమ్‌ను తింటే నోట్లోంచి, ముక్కులోంచి పొగలు కక్కాల్సిందే. దాన్ని సుమ తింటూ తనదైన శైలిలో హావభావాలు ఒలకబోస్తూ, ఐస్‌క్రీమ్‌ రుచిని ఆస్వాదించింది. దాన్ని తింటూ నవ్వుతూ అందరినీ నవ్విస్తోంది. ఓ డ్రాగన్‌ వదిలే శ్వాసలా ఇలా పొగ వచ్చేస్తోందని సుమ పేర్కొంది. ఎప్పుడూ మాటలతో చమత్కరించే సుమ, ఈ సారి చేతలతో వీక్షకులను నవ్విస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories