వీటి ప్రస్తావన కరెక్ట్ కాదు సుమా!

Anchor Suma Samantha Yashoda Interviewఇది ఇంటర్ నెట్ యుగం. ఒక వార్త తాలూకు నిజం నిద్రలేచేలోపు దాని అబద్దపు జిరాక్సులు ఊరంతా పాకిపోతాయి. ఫోర్ జి టెక్నాలజీ వచ్చాక ఇది మరింత మితిమీరిపోయింది. వీడియోలకు చిత్ర విచిత్ర హెడ్డింగులతో థంబ్ నైల్స్ పెట్టడం తీరా వాటిని క్లిక్ చేసి చూశాక అందులో ఏమీ లేకపోవడం యూట్యూబ్ లో కోట్లకొద్దీ ఉదాహరణలున్నాయి. వాటి గురించి ఆలోచించడం వల్ల టైం వేస్ట్ తప్ప ఒరిగిదేమి ఉండదు. ఆ మధ్య ఒక హీరో ట్రోలింగ్ గురించి విపరీతంగా ఆలోచించి స్పందించి పోలీస్ కంప్లయింట్ దాకా వెళ్ళాడు కానీ తీరా చూస్తే జరిగింది శూన్యం. ఎవరూ ఏమీ చెయలేని అదో విచిత్రమైన అంతర్జాల ప్రపంచం.

ఇక వెబ్ మీడియా విస్తృతంగా పెరిగాక నమ్మకమైన వెబ్ సైట్ల పట్ల చదువరులు పెంచుకున్న విశ్వనీయత అవాస్తవాల పట్ల ప్రభావితం చెందదు. ఇంకా చెప్పాలంటే మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ కన్నా చాలా సందర్భాల్లో వెబ్ చూపించిన నిబద్ధతే ఎక్కువ. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం సమంతా ఇవాళ చేసిన ఇంటర్వ్యూలో యాంకర్ సుమ లేవనెత్తిన కొన్ని అంశాల పట్ల. నిజానికి సామ్ ఉన్న పరిస్థితిలో అసలు ఇంటర్వ్యూ ఇవ్వడమే గొప్ప విషయం. యశోద సినిమా తన ఇమేజ్ మీదే కోట్లాది రూపాయల వ్యాపారం చేసింది కాబట్టి ఒక బాధ్యతగా ప్రేక్షకులకు ఒక అప్పీల్ ఇవ్వడం కోసం ఈ ముఖాముఖీకి ఒప్పుకుంది. ఇలా చేయడమూ ఒక రకంగా రిస్కే

ADVERTISEMENT

అలాంటప్పుడు సున్నితమైన సామ్ మానసిక స్థితిని గుర్తెరిగి దానికి తగ్గట్టుగానే మసలుకుంటే ఇంకొంత స్వాంతన ఎక్కువ దక్కేది. అంతే తప్ప సుమ నాకూ గతంలో థ్రోట్ పెయిన్ వచ్చింది అందరూ క్యాన్సరని రాశారు పోయానని చెప్పారని అదే పనిగా చెప్పడం ఈ సందర్భంలో కరెక్ట్ కాదు. హెడ్డింగులు పెట్టారని, జబ్బుకు సంబంధించిన ట్వీట్ లో ప్రతి అక్షరాన్ని కాచి వడబోశారని గుచ్చి గుచ్చి చెప్పడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుంది. అసలు సమంతాకు అంత తీరికగా ప్రతి పత్రికలో వెబ్ సైట్ లో ఏమొచ్చిందని చూసేంత తీరికా ఓపిక ఉండవు. అసలు డాక్టర్లే వద్దంటారు. అలాంటప్పుడు లేనిపోనివి గుర్తు చేయడం భావ్యం కాదు

సమంతా కంటితడి, గుండెల్లో దాచుకున్న బాధ, ఎక్కువ రోజులు నాలుగు గోడల మధ్య ఉండాల్సి వచ్చిన పరిస్థితి గురించి ఆమె ఎంత వేదన చెందుతుందో కళ్లారా చూసిన ప్రతి ఒక్కరికి హృదయం బరువెక్కింది. తనేవో ఆర్టికల్స్ చదివిందని చెప్పినంత మాత్రం దాన్ని మళ్ళీ సాగదీయాల్సిన అవసరం లేదుగా. అసలు సుమనే కాదు ఎవరూ లేకుండా సామ్ సోలోగా ఒక వీడియో మెసేజ్ ఇచ్చినా కోట్లాది జనం చూసేవాళ్ళు ఆశీర్వదించేవాళ్ళు. ఇప్పుడూ అదే చేస్తున్నారు కానీ వేరే టాపిక్స్ ప్రస్తావన రాకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. ఇంకో రెండే రోజుల్లో యశోద థియేటర్లో అడుగుపెడుతోంది. దానితో పాటు హాస్పిటల్ నుంచి సమంత బయటికి వచ్చే క్షణాల కోసమే అభిమానుల ఎదురుచూపులు.

ADVERTISEMENT
Latest Stories