రాజ్ తరుణ్ రేంజ్ చూస్తారా!

Andhhagadu First Day Collections‘ఈడోరకం ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాలతో వరుసగా రెండు కమర్షియల్ సక్సెస్ లు అందుకున్న యువ హీరో రాజ్ తరుణ్, హ్యాట్రిక్ కోసం “అంధగాడు” రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘టైం పాస్ ఎంటర్టైనర్’గా విమర్శకులు, ప్రేక్షకులు కితాబిచ్చారు. ఇక ఓపెనింగ్స్ చూస్తే కళ్ళు తిరిగే రేంజ్ లో ఉండడమే ఇక్కడ కొసమెరుపు. రాజ్ తరుణ్ వంటి హీరో సినిమాకు తొలి రోజు 3.75 కోట్లు ఓపెనింగ్స్ రావడమంటే మాటలు కాదు.

ADVERTISEMENT

‘బాహుబలి 2’ తర్వాత తెలుగు మార్కెట్ పెరిగింది అని చెప్పడానికి నిదర్శనమో లేక వరుస హిట్లు మీదున్న రాజ్ తరుణ్ పై నమ్మకమో గానీ అదిరిపోయే ఓపెనింగ్స్ తో దాదాపుగా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యువహీరో. కెరీర్ లో ఇప్పటివరకు 7 సినిమాల్లో నటించగా, 6 హిట్లు సొంతం చేసుకున్న రాజ్ తరుణ్, ‘అంధగాడు’ సినిమాతో ‘కెరీర్ బెస్ట్’ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నాడు.

‘ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ, కుమారి 21ఎఫ్’లతో తొలి హ్యాట్రిక్ అందుకున్న తరుణ్, ఆ తర్వాత ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాతో పరాజయం చవిచూసాడు. మళ్ళీ ‘ఈడోరకం ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు’ సినిమాలతో మరో హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకున్నట్లే భావించవచ్చు. తొలిరోజే ఈ స్థాయి ఓపెనింగ్స్ తో పాటు పాజిటివ్ టాక్ ఉండడంతో బంపర్ హిట్ ను సాధించినట్లే!

ADVERTISEMENT
Latest Stories