నాని గారి స్టోరీలో “తండ్రి – కొడుకులు” ఎవరు?

Andhra Pradesh YSRCP Leader Perni Naniఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు పేర్ని నాని గారు చెప్పిన ఓ కధ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా ఆ కధ ఏమిటో తెలుసుకుందాం…

వెనకటికి ఓ సామెత ఉంది, ఒక తండ్రి చచ్చిపోతు చచ్చిపోతూ మంచాన పడి, ఇంతవరకు కూడా నేను ఎవరితో మంచి అనిపించుకోలేదు, నా చివరి కోరిక నన్ను మంచి అనిపించేటట్టు చేయమని కొడుకుని అడిగాడట!

ADVERTISEMENT

కొడుకు ఆలోచించి ఆలోచించి ఇక అతనికి ఒకటే తట్టింది. తండ్రి చేసినటువంటి చెండాలం కంటే, 100 రెట్లు చెండాలం చేస్తే గానీ, మా నాన్నకు మంచి పేరు రాదని చెప్పి, కొడుకు ఇక అక్కడ నుండి చేయని దుర్మార్గం లేదు.

చివరికి ప్రపంచం అంతా కూడా తండ్రే నయంరా బాబు, వీడు మరీ సప్పగా చెండాలంగా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకుంటే, తండ్రి ఆత్మ శాంతించిందంట… పోనీయ్ లే నా కొడుకు చివరి రోజుల్లో నా మాట తీర్చాడు అని!

మంత్రి గారు చెప్పిన స్టోరీ ఎవరికి సంబంధించినదో మాకైతే అర్ధం కాలేదు గానీ, సోషల్ మీడియాలో ఈ వీడియోకు అపూర్వమైన స్పందన వస్తోంది. మీకు గనుక తెలిస్తే సదరు తండ్రి కొడుకులు ఎవరన్నది కామెంట్స్ లో చెప్పచ్చు!

ఈ వీడియో చూసిన తర్వాత “నాని గారు మామూలు పజిల్ ఇవ్వలేదు మరి” అనుకోవడం సహజమే!

https://twitter.com/HanuViews/status/1474596674781601797

ADVERTISEMENT
Latest Stories