వైరల్ : వైసీపీ ఎమ్మెల్యే వీడియో!

YSR Congress Party Leader Undavalli Srideviఎవరు మీకు ఇన్స్పిరేషన్ అంటే మన బాబూ జగజ్జీవన్ రామ్ ను తీసుకోవాలి. ఆయన కూడా ఎంతో కష్టపడ్డారు. ఎందుకంటే స్వాతంత్య్ర సమరంలో పాల్గొంటూ మన అనగారిన కులాలకు రాజకీయ చైతన్యం చేయిస్తూ… అంబేద్కర్ గారి వలన హక్కులు వచ్చాయా? లేదు.

కనుక బాబూ జగజ్జీవన్ రామ్ గారు మనకి ఈ యొక్క రాజ్యంగంలో హక్కులను ప్రవేశపెట్టి మనకి రాజకీయంలో అన్ని సామాజికంగా, రాజకీయంగా మనము ఇలా ఎదుగుతున్నాము అంటే అదంతా కూడా బాబూ జగజ్జీవన్ గారి ఘనత అని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ADVERTISEMENT

మరి నిజంగా ఉండవల్లి శ్రీదేవి అంతటి వ్యాఖ్యలు చేసారో లేక ఇందులో మర్మం ఏమైనా దాగి ఉందో తెలియదు గానీ ‘అంబేద్కర్ గారి వలన హక్కులు వచ్చాయా’ అంటూ ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇందులోనే తాజాగా మరో వీడియో కూడా వచ్చి చేరింది.

ఏ విగ్రహమో తెలియక ‘అది అంబేద్కర్ విగ్రహమే కదా’ అంటూ పక్కన ఉన్న వారిని ఉండవల్లి అడగడం కూడా వైరల్ అయ్యింది. కనీసం ‘అంబేద్కర్ గారు’ అని సంభోదించకపోవడం విశేషం. ఈ మాట అయితే మీడియాలో స్పష్టంగా రికార్డు అయ్యింది. గుంటూరు వేదికగా జరిగిన రసాభాస ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎక్కింది.

స్వయంగా తమ చేతులతో పూలమాల వేసిన విగ్రహాన్ని గుర్తుపట్టలేని స్థితిలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండడం కేవలం మరపుగా భావించాలా? వైసీపీ ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యమా? అసలు ఒక ప్రజాప్రతినిధిగా ఇలాంటి వ్యాఖ్యలకు ఆస్కారం ఇవ్వవచ్చా?

కులాలకతీతంగా ఓ రాజ్యాంగ సృష్టికర్తగా అంబేద్కర్ గారు మన దేశ సంపద. అలాంటి వ్యక్తి విగ్రహాం కూడా తెలియకుండానే దండలు వేసి దండం పెట్టారంటే, వీరి ‘నమస్కారంలో ఉన్న సంస్కారం’ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories