పేదవాడు సినిమా టికెట్ Rs.5/-, చెత్త పన్ను Rs.100/-

Dharmana-Prasad-Rao100 రూపాయలు కలెక్ట్ చేస్తే దానికి పెద్ద ఆర్గుమెంట్స్ ఎందుకు? ఏమిటి, దేనికోసం అది? ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తోంది కదా. ఏంటి అంత పెద్ద విషయం ఏముంది? 12 నెలలు 1200 రూపాయలు… నువ్వు చేస్తోన్న చెత్తంతా తీసుకువెళ్లి ప్రొసెస్ చేసి ఎక్కడికో పట్టుకెళ్లి నిరంతరం కొన్ని వందల మంది పని చేస్తుంటే దానికివ్వడం పెద్ద కష్టమా?

కరెక్ట్ కాదు, అది కట్టమని అందరికి గట్టిగా చెప్పండి, సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ దాని మీద పని చేయండి. కాకపోతే ఎవరింట్లో చెత్త వాళ్ళింట్లో వదిలేస్తాం… ఇష్టమేనా? మరి తీసుకెళ్ళ, వాళ్ళింటి ముందే పోసేస్తాం, అనుభవించండి తెలుస్తది. అలాంటివన్నీ ప్రోత్సహిస్తే ఎలా అవుతుంది. ఎక్కడ్నుంచి తెస్తది ప్రభుత్వం మాత్రం డబ్బు. ఓ పది పథకాలకు డబ్బులు పంచే కార్యక్రమం చేయాలి, ఇలాంటి వాటికి మనం పైసా కట్టమంటే ఎలా?

ADVERTISEMENT

ఇది వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ నోట నుండి జాలువారిన పలుకులు. గడిచిన దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రభుత్వం గానీ, ఏ మున్సిపాలిటీ గానీ, ఏ కార్పొరేషన్ గానీ చెత్తను సేకరించలేదు, ఈ మూడేళ్ళుగా వైసీపీ వచ్చిన తర్వాతే ప్రజలకు ఇబ్బంది లేకుండా చెత్తను సేకరిస్తున్నట్లుగా ధర్మాన ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు నిలుస్తున్నాయి.

ఇందులో విడ్డూరం కలిగించే విషయం ఏమిటంటే, ‘పధకాలు ఇస్తున్నాము కదా – మీరు మళ్ళీ తిరిగి చెల్లించలేరా’ అంటూ ప్రజల నుండి డిమాండ్ చేయడం! రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి జగన్ సర్కార్ పధకాలు వర్తింపచేయట్లేదు కదా, మరి ఈ పన్నులు పధకాలు ఇచ్చే వారికే ఈ చెత్త పన్నును అమలు చేస్తున్నారా? లేక రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి అమలు చేస్తున్నారా?

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా జగన్ సర్కార్ పంచి పెడుతోంది. బహుశా అదే ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ‘చెత్త పన్ను’ను కూడా విధిస్తామని చెప్తే, ఈ రోజు ధర్మాన ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సమంజసంగా ఉండేవి. ఏడాదికి 1200 రూపాయలు అంటే బహుశా వైసీపీ ఎమ్మెల్యేకు చాలా తక్కువ అయ్యుండొచ్చు గానీ, పేద ప్రజలకు అంత మొత్తం తక్కువేనా?

అందులోనూ 100 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనలేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్తోన్న వైసీపీ ప్రభుత్వం, మరి చెత్త పన్నును మాత్రం నెలకు 100 రూపాయలు చొప్పున ఏ విధంగా వసూలు చేస్తోంది? అన్న వివరణ ఇస్తే బాగుండేది. అయినా స్థాయికి మించి పధకాలు పెట్టి, మళ్ళీ ప్రజల నుండి తిరిగి రాబట్టేందుకు ఇంత కష్టపడడం ఎందుకు?

ADVERTISEMENT
Latest Stories