అంతన్నాడు.., ఇంతన్నాడే రాష్ట్రాన్ని అంధకారంలో ముంచేసాడే…!

YSRCP GOVT Power Cuts in Andhra Pradeshదేవుని దయ., ప్రజలందరి “చల్లని దీవెనలతో” ప్రభుత్వం స్థాపించామని పదేపదే చెప్పే జగన్ ఇప్పుడు అదే ప్రజలకు “వెచ్చని దీవెనలు” అందిస్తున్నారని ఆగ్రహంలో ఉన్నారు ఏపి రాష్ట్ర ప్రజానీకం. మండుతున్న ఎండలు.., భగ్గుమంటున్న విద్యుత్ చార్జీలు…,అల్లాడిస్తున్న కరెంట్ కోతలతో ప్రజలు భానుడికన్నా భగభగ మంటున్నారు.

గత ప్రభుత్వ హయాంలో టెండర్లను ఎక్కవ రేటుకి వేసి చంద్రబాబు విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నారని., మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరెంట్ చార్జీలను పూర్తిగా తగ్గిచేస్తామని అక్క చెల్లమ్మలకు వాగ్దానం చేస్తున్నానంటూ జగన్ ప్రజల ఆశలను కరెంట్ పోల్ ఎక్కించ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక చార్జీలు తగ్గించక పోగా రెండింతలు పెంచుకుంటూ పోయారు.

ADVERTISEMENT

పెంచిన విద్యుత్ చార్జీలతో అల్లాడుతున్న ప్రజలను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి కరెంట్ కోతలు విధించారు. పెంచిన చార్జీలు ఎటు తగ్గించలేం కాబట్టి కనీసం ప్రజల కరెంట్ వాడకాన్ని తగ్గిద్దాం అనే సదుద్దేశంతోనే ఈ కరెంట్ కోతల పధకానికి నాంది పలికారు జగన్ అంటూ టీడీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

ఈ సందర్భంగా…, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.., ఎం తముళ్లు మల్లి చీకటి రోజులు వచ్చాయా? “పాలిచ్చే ఆవుని కాదని ఎగిరి తన్నే దున్నపోతుని కోరండి తెచ్చుకున్నారు”. అప్పుడు నేను చెపితే మీరు విన్నారా? అంటూ ప్రజలకు చురకలు వేశారు. తాము అధికారంలోకి వచ్చేటప్పటికి 22.5మిలియన్ యూనిట్ల కరెంట్ కొరత ఉంటే రెండు నెలల లోపల కరెంట్ కొరతను తీర్చి మిగులు విద్యుత్ తెచ్చిన ఘనత తెలుదేశం పార్టీది అన్నారు.

ఒక పక్క గ్రామ, గ్రామాన ప్రజలు కరెంట్ కోతలతో అల్లాడుతుంటే వాలంటీర్లకు సన్మానం అంటూ 233కోట్లు తగలేస్తూ పండగ చేసుకుంటున్న మీ ప్రభుత్వాన్ని ఏమనాలి? అంటూ లోకేష్ తన ఆవేదనను తెలిపారు. నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ లేక సెల్ ఫోన్ లైట్ల సాయంతో డెలివరీ చేసిన ఉదంతాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లోకేష్.

ఎన్నికల ముందు జగన్ హామీలను.., ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఈ విద్యుత్ కోతలను చూసిన టీడీపీ నాయకుడు బేబీ నాయిన సందర్భానుచితంగా “ఇంతన్నాడు.., అంతన్నాడే జగనన్న రాష్ట్రాన్ని అంధకారంలో ముంచేసాడే జగనన్న” అంటూ ఓ పాట అందుకున్నారు.

https://twitter.com/sonusam4599/status/1512020810181267457?s=20&t=KPksEDuNx6Rmp2bi01oCTQ

https://twitter.com/TrendsTwood/status/1512044076425629704?s=20&t=KPksEDuNx6Rmp2bi01oCTQ

https://twitter.com/chinnapawan11/status/1512038588027863049?s=20&t=KPksEDuNx6Rmp2bi01oCTQ

https://twitter.com/HarishJSP_PK/status/1512024665937813504?s=20&t=KPksEDuNx6Rmp2bi01oCTQ

https://twitter.com/Pe_te_r3/status/1512021256396480514?s=20&t=KPksEDuNx6Rmp2bi01oCTQ

https://twitter.com/Kishore4Mahesh3/status/1512004003219271681?s=20&t=KPksEDuNx6Rmp2bi01oCTQ

https://twitter.com/Cerca007/status/1512006980843487234?s=20&t=KPksEDuNx6Rmp2bi01oCTQ

https://twitter.com/mohanindugula/status/1511988503545974784?s=20&t=KPksEDuNx6Rmp2bi01oCTQ

https://twitter.com/Iloveindia_007/status/1511727562195537926?s=20&t=oBC6MvSx1wlqnHegY4JAjQ

https://twitter.com/Shivaa11111/status/1511693507034955776?s=20&t=GAcwG_PvDJc11A2G4ErgEQ

https://twitter.com/suryakadiyam/status/1511476359180144643?s=20&t=T6TQ4TILZru8s6LIlMiWbg

ADVERTISEMENT
Latest Stories