డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా నేడు కాకినాడ జిల్లా, పిఠాపురంలో పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానాన్ని సందర్శించారు. ఆమెకు ఆయా ఆలయాల అధికారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు.
హిందూ సాంప్రదాయ బద్దంగా చక్కగా చీర కట్టుకొని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని దర్శనం కోసం వచ్చిన ఆమెను భక్తులు పలకరిస్తుంటే, ఆమె కూడా వారికి ఆప్యాయంగా పలకరించారు. అడిగినవారికి కాదనకుండా సెల్ఫీలు దిగారు.
కానీ తన వలన సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా ఆమె దర్శనాలు, పూజలు ముగించుకొని తిరిగి వెళ్ళిపోయారు.
విదేశీయురాలు, క్రీస్టియన్ మతస్తురాలైన అన్నా లెజినోవాకి హిందూమతంపై ఇంత గౌరవం, హిందూ దేవుళ్ళపై ఇంత నమ్మకం, భక్తి ఉండటం చాలా గొప్ప విషయమే కదా?
కానీ మేము హిందువులమే అని చెప్పుకునే కొందరు ప్రతిపక్ష నాయకులు, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైన ఏడుకొండలవాడికి చేసిన అపచారాలు అన్నీ ఇన్నీ కావు. తిరుమల కొండపై రాజకీయాలు చేయాలని బయలుదేరి డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయాల్సి వస్తుందని చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకున్నవారూ ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే అన్నా లెజినోవా ఎంతో ఉన్నతంగా కనిపిస్తారు కదా?
ఇతర మతాలను ఆచరించకపోయినా వాటిని ద్వేషించాల్సిన అవసరం లేదు. కేవలం గౌరవిస్తే చాలు. కానీ అన్నా లెజినొవా కేవలం గౌరవించడమే కాదు.. హిందూ మతాచారాలను పాటిస్తున్నారు కూడా. ఈ లెక్కన తిరుమలలోనే అపచారాలకు పాల్పడిన మనోళ్ళ కంటే ఆమె వెయ్యి రెట్లు నయం కదా?




