వర్ధమాన మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆత్మహత్య కలకలం!

Anurag-Vineel---Young-Music-Director's-Suspicious-Suicideవర్ధమాన సంగీత దర్శకుడు అనురాగ్ వినిల్ అలియాస్ నాని ఆత్మహత్య ఉదంతం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. వారం క్రితమే ఆత్మహత్యకు పాల్పడినప్పటికీ, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మరోవైపు అతను ఎక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు? అనే విషయంలో కూడా విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ సమీపంలోని మర్పల్లిలో అని, హైదరాబాదులోని నాగోల్ మమతానగర్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న టాక్ ఉంది గానీ, అసలు నిజం తెలియరాలేదు.

సంగీత దర్శకుడిగా పలు షార్ట్ ఫిలింస్ కు పని చేసిన అనురాగ్, వర్మ, సుకుమార్ వంటి క్రియేటివ్ దర్శకులతో దిగిన సెల్ఫీలు ఉన్నాయి. ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం అందరినీ కలచివేస్తోంది. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోగా, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 9వ తేదీన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అనురాగ్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories