అనుష్క తో నాగార్జున 12వ సారి!

Anushka Shetty 12 movie with Nagarjunaకింగ్ నాగార్జున సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టింది. తాజాగా ఈ చిత్రం కోసం అనుష్కను హీరోయిన్ గా తీసుకున్నట్టు సమాచారం. గెస్ట్ రోల్స్, స్పెషల్ రోల్స్ కలిపి ఈ జోడి ఇప్పటిదాకా 11 సినిమాల్లో నటించింది.

ADVERTISEMENT

ఇది వారి 12వ సినిమా. గతంలో నాగార్జున రామ్ గోపాల్ వర్మ కలిసి శివ, అంతం, మరియు గోవిందా గోవిందా సినిమాలు చేసారు. ఇందులో శివ సినిమా తెలుగు సినిమా గమనానే మార్చేసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అన్నపూర్ణ స్టూడియోలో ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఈ షెడ్యూల్ అనంతరం నాగార్జున చిన్న బ్రేక్ తీసుకుని అఖిల్ హలో సినిమా పనులు ఒక నెల పాటు చూస్తారు. తరువాత జనవరిలో తిరిగి ఈ సినిమా మొదలు పెడతారు. వేసవి కానుకగా ఏప్రిల్ లో సినిమా విడుదల చెయ్యాలని ప్రస్తుతానికి ఉన్న ప్లాన్. నాగార్జున ఈ సినిమాలో ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు.

ADVERTISEMENT
Latest Stories