అన్వేష్… అన్వేషణ జైల్లో చిప్పకూడు కోసమే?

Anvesh Chinni Controversy: Police Cases & Escape

తెలంగాణలో ఖమ్మం జిల్లాకు చెందిన అన్వేష్ చిన్ని అనే యువకుడు దేశవిదేశాలు పర్యటిస్తూ ఆ విశేషాలు తన యూట్యూబ్‌ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు.

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు ఇంత కంటే చాలా ఎక్కువే పాపులారిటీ ఉంటుంది. కానీ వారు గీత దాటరు. ఒకవేళ గీత దాటినా ఆ సమస్య నుంచి ఏదో విధంగా బయటపడుతుంటారు.

ADVERTISEMENT

కానీ సోషల్ మీడియాలో పాపులారిటీతో నెత్తిన కొమ్ములు మొలిస్తే వాటిని ఎవరూ ఎక్కువ కాలం దాచిపెట్టుకోలేరు. అన్వేష్ కూడా అలాగే దొరికిపోయాడు.

అతనేమీ పరాయిదేశం వాడు కాదు. పరాయి మతం వాడు కాదు. అయినా ఇటీవల నటుడు శివాజీ మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలను పట్టుకొని హిందూ దేవీదేవతల వరకు వెళ్ళిపోయి చాలా అసభ్యంగా కామెంట్స్ చేశాడు.

హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. విశ్వ హిందూ పరిషత్, నటి కరాటే కల్యాణితో సహా పలువురు అతనిపై తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంతో సహా పలు ప్రాంతాలలో అతనిపై పలు పోలీసు కేసులు నమోదయ్యాయి.

దీంతో అతను దేశం వదిలి పరారయ్యాడు. ఈనేపధ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ సంస్థ అతని ఖాతాని రద్దు చేసింది. దీంతో అతని ఇగో హర్ట్ అయినట్లుంది. ఓ వీడియో విడుదల చేసి దానిలో “నాతో యుద్ధం చేస్తున్నవారందరూ బత్తాయిలు… ఎవరూ నా వెంట్రుక కూడా పీకలేరు.. నా ఇన్‌స్టాగ్రామ్‌ ఉంటే ఎంత పోతే ఎంత?యూట్యూబ్‌ ద్వారానే నెలకు 8 లక్షలు సంపాదిస్తున్నా… మీ అందరికీ ఇక నరకం చూపిస్తా,” నంటూ మళ్ళీ రెచ్చిపోయాడు.

ఇదివరకు ఐబొమ్మ రవి కూడా ఇలాగే “నన్ను ఎవరూ ఏం పీకలేరు… దమ్ముంటే పట్టుకోండి చూద్దాం,” అంటూ పోలీసులకు సవాలు విసిరితే వెళ్ళి జైల్లో పడ్డాడు. మూడు నెలలు జైల్లో చిప్పకూడు తిన్నాడు.

మొన్న బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు ఎంతగా అడిగినా నోరు విప్పడానికి భయపడ్డాడు. రేపు అన్వేష్ పట్టుబడితే అతని పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అతను జైలుకి వెళ్ళడం ఎలాగూ తప్పదు. కానీ నోటి దురుసుతో, అహంభావంతో ఇంతమందిని శత్రువులుగా మార్చుకునందుకు కాళ్ళు చేతులు విరగొట్టకుండా విడిచిపెడితే అదృష్టవంతుడే.

చివరిగా ఓ మాట: సోషల్ మీడియాతో లోకాన్ని శాశించవచ్చు. కానీ దాంతో ఆడుకుంటే అదే మన జీవితాలను శాశిస్తుంది… జైల్లో చిప్పకూడు తినిపిస్తుంది కూడా!

ADVERTISEMENT
Latest Stories