కనీవినీ ఎరుగని స్థాయిలో పుష్ప-2 ప్రమోషన్స్ సాగుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ‘వైల్డ్ ఫైర్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాటన్నిటికీ పరాకాష్టగా చెప్పవచ్చు. ఈ సినిమా గురించి దర్శకుడు సుకుమార్, రాజమౌళి, బుచ్చిబాబు, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ తదితరులు చెప్పిన మాటలు వింటే పుష్ప-2 బాహుబలి, ఆర్‌ఆర్‌ర్ మించిన సినిమా కాబోతోందనిపిస్తుంది.
Also Read – జగన్ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!
రాజమౌళి వంటి దర్శకులు మోహమాటం కోసం సినిమా గురించి గొప్పగా చెప్పాక సినిమా బాగోకపోతే వారి మాటకు విలువపోతుంది. కనుక పుష్ప-2 చాలా అద్భుతంగా ఉండబోతోందని వారు చెప్పింది నూటికి నూరు శాతం నిజమే అనుకోవచ్చు.
సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ కూడా అదే సూచిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.275 కోట్లు చెల్లించి ఈ సినిమా ప్రసార హక్కులు తీసుకున్నట్లు సమాచారం. ఇదొక్కటికీ చాలు పుష్ప-2 రేంజ్ ఏమిటో అర్దం చేసుకోవడానికి.
Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్ విశాఖపట్నమే!
ఏపీ ప్రభుత్వం కూడా డిసెంబర్ 4న రాత్రి 9.30, ఒంటి గంట షోలకు రూ.800 పెంచుకునేందుకు అనుమతించింది.
డిసెంబర్ 5న ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతించింది. వాటికి సింగిల్ స్క్రీన్స్ లోవర్ క్లాస్ టికెట్ ధరపై అదనంగా రూ.100, అప్పర్ క్లాస్ రూ.150, మల్టీప్లెక్స్ రూ.200 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణ ప్రభుత్వం మూడు వారాలు టికెట్ ధరల పెంపుకి అనుమతించగా, ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 17 వరకు అంటే 12 రోజులకు అనుమతించింది.
Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!
ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు ఇవ్వడం, ఆ తర్వాత సినీ కార్యక్రమాలలో మాట్లాడిన మాటలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోకుండా పుష్ప-2ని కూడా ఓ పెద్ద సినిమాగానే చూసి టికెట్స్ ధర, బెనిఫిట్ షోలు, అదనపు షోల ప్రదర్శనకు అనుమతించడం చాలా అభినందనీయం. అదే… జగన్ హయాంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంతగా ముప్ప తిప్పలు పెట్టిందో అందరికీ తెలుసు.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపుకి జీవోలు జారీ చేయడంతో రెండు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ చలీ కాలంలో దేశవ్యాప్తంగా వ్యాపించబోతున్న వైల్డ్ ఫైర్ (కార్చిచ్చు) ఏవిదంగా ఉండబోతోందో చూడాలి.
—