నింగిలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌, నేలపై ఆర్టీసీ డ్రైవర్ శివ!

APSRTC Driver Shiva Saves 40 Passengers Before His Death

ఇండియన్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కోపైలట్ కాక్‌పిట్‌లో కత్తితో దాడి చేస్తున్నప్పుడు ఓ పక్క అతని కత్తిపోట్లు ఎదుర్కొంటూనే కాక్‌పిట్‌ తలుపు తెరిచారు. ఆయన చేసిన ఈ సాహసంతో విమానంలోని 170 మంది ప్రాణాలు కాపాడగలిగారు.

ADVERTISEMENT

తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటం సంతోషం కలిగిస్తుంది.

ఆయనకు భారత్‌తో సహా పలు దేశాలు అవార్డులు, నగదు పురస్కారాలు, అత్యున్నత పౌర సత్కారాలు ప్రకటిస్తున్నాయి. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ పూర్తిగా కోలుకోగానే వరుసగా ఆ కార్యక్రమాలకు హాజరవుతారు.

ఈ నేపధ్యంలో చూస్తే ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ శివ కూడా అంత గౌరవ మర్యాదలకు అర్హుడే.

కాకినాడ నుండి వైజాగ్ వస్తున్న ఆర్టీసీ బస్సును నడుపుతున్నప్పుడు డ్రైవర్ శివకు హటాత్తుగా గుండెపోటు వచ్చింది. అయితే తన ప్రాణం కంటే తన బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు కాపాడటం ముఖ్యమనుకున్నారు. అంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా గుండె నొప్పిని లెక్కచేయకుండా బస్సును సురక్షితంగా రోడ్డు పక్కకు తీసి ఆపి స్టీరింగ్ మీదనే తలవాల్చి తుదిశ్వాస విడిచాడు డ్రైవర్ శివ!

కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ ఆకాశంలో విమాన ప్రయాణికులను కాపాడితే, డ్రైవర్ శివ నేలపై నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. కానీ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవ మర్యాదలు, పురస్కారాలు డ్రైవర్ శివకు లభించవని అందరికీ తెలుసు. వాటిని వారు ఆశించి ఈవిధంగా చేయలేదు కూడా.

కానీ ఏపీఎస్ ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రైవర్ శివ సేవలను గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆయనను ప్రశంసించడం, నివాళులు అర్పించడం మాత్రమే సరిపోదు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆయన కుటుంబానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందించి అండగా నిలవాలి.

ADVERTISEMENT
Latest Stories