అరవింద్‌ స్వామి ఎందుకు ఒప్పుకోవడం లేదు?

aravind swamy rejecting thani oruvan remakeమెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తమిళం సూపర్‌ హిట్‌ చిత్రం ‘తని వరువన్‌’ రీమేక్‌ అవుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తెలుగు వర్షన్‌ స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది. ప్రస్తుతం నటీ నటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రకు ఒరిజినల్‌ వర్షన్‌లో నటించిన అరవింద్‌ స్వామిని ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు. కథకు మరియు విలన్‌ పాత్రకు ఆయనైతేనే సరైన న్యాయం చేస్తాడని అంతా భావించారు. కాని అరవింద్‌ స్వామి మాత్రం తమిళ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్లు కేటాయించలేను అంటూ సారీ చెప్పాడట.

ఈ రీమేక్‌ను నిర్మిస్తున్న అల్లు అరవింద్‌ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిగా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. ఏకంగా 5 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు సైతం నిర్మాత ఓకే చెప్పాడు. కాని అరవింద్‌ స్వామి మాత్రం ఇంకా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఏ విలన్‌ కూడా అందుకోని పారితోషికం ఇస్తాము అని చెప్పినా కూడా అరవింద్‌ స్వామి ఒప్పుకోక పోవడం అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తోంది. డేట్ల విషయమేనా లేక మరేదైనా కారణంతో అరవింద్‌ స్వామి ఒప్పుకోవడం లేదా అనే విషయంపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

ADVERTISEMENT
Latest Stories