‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ సెంటిమెంటో ఏమో గానీ, తన ప్రతి సినిమా ప్రమోషన్ కు హీరోకు ఒక బ్యాగ్ తగిలిస్తున్నారంటూ నెటిజన్లు ‘గురూజీ’పై కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్ 11 విడుదల అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఓ బ్యాగ్ వేసుకుని వెళ్తున్న పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో సోషల్ మీడియా జనులకు అవకాశం చిక్కినట్లయ్యింది.
[m9ad]
ADVERTISEMENT
త్రివిక్రమ్ ఆల్ టైం క్లాసిక్ ‘అతడు’ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా ఇలా బ్యాగ్ తోనే దించగా, ఆ తర్వాత అదే ఒరవడిని ‘ఖలేజా, సన్నాఫ్ సత్యమూర్తి,, అ…ఆ…’ సినిమాలలోనూ కొనసాగించాడు. సెంటిమెంట్ ఏదైనా… అవి చివరికి సక్సెస్ ఫుల్ గా ఉండడంతో, యంగ్ టైగర్ అభిమానులు కూడా ఈ సెంటిమెంట్ తో ఖుషీగా ఉన్నారు. ‘ఈ సెంటిమెంట్ తోనే ‘గురూజీ ఈజ్ బ్యాక్’ అంటున్నారు.
ADVERTISEMENT



