అరవింద సమేత… ఓ గుడ్ న్యూస్..!

why-aravindha-sametha-needs-to--workవచ్చే వారం విడుదలకు ముస్తాబవుతోన్న “అరవింద సమేత” సినిమా గురించి ఓ తీపికబురు అందుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిడివి ప్రేక్షకులకు అనుకూలంగా ఉండడం చెప్పుకోదగ్గ విషయం. సహజంగా త్రివిక్రమ్ సినిమాలంటే మూడు గంటలు మినిమమ్. మొదటి రోజు సినిమాకు వచ్చిన టాక్ ను బట్టి, ఆ తర్వాత ఎడిటింగ్ విభాగాలు పనిచేస్తాయి.

[m9ad]

ADVERTISEMENT

తాను దర్శకత్వం వహించిన మొదటి సినిమా నుండి త్రివిక్రమ్ అనుసరిస్తున్న విధానమే. అయితే “అరవింద సమేత”కు మాత్రం ఈ తప్పు చేయబోవడం లేదట. కేవలం రెండున్నర్ర గంటల నిడివితోనే ఈ సినిమాను సిద్ధంగా చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో రెగ్యులర్ కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ‘అరవింద సమేత’ నిడివి ధియేటర్లోని ప్రేక్షకులకు పెద్దగా ఇబ్బంది కాబోదు.

ఈ సినిమాలో అయిదవ సాంగ్ ఉంటుందని జరిగిన ప్రచారం కూడా నిజం కాదని తేలిపోయింది. థమన్ కంపోజ్ చేసిన మాట వాస్తవమే గానీ, స్క్రిప్ట్ కు నాలుగు పాటలు సరిపోవడంతో, అయిదవ పాటను పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా తెలిసింది. ఇక సెన్సార్ కార్యక్రమాలను 6వ తేదీన పూర్తి చేసుకుని, 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కావడానికి ముస్తాబు అవుతోంది.

ADVERTISEMENT
Latest Stories