అరవింద సమేత రికార్డుల వేట మొదలు..

aravindha-sametha-movie-public-talkయంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయిక లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ ఎట్టకేలకు విడుదలయి ఫాన్స్ ఎదురుచూపులకు తెర దించింది. అందరు ఊహించిన విధంగానే, యంగ్ టైగర్ పవర్ఫుల్ ఆక్షన్ తో మూవీ మంచి టాక్ సంపాదించుకోడమేగాక రికార్డుల వేటలో పయనిస్తుంది.

[m9ad]

ADVERTISEMENT

యూ.స్. ప్రీమియర్ కలెక్షన్స్ లో ‘అరవింద సమేత’ ఇప్పటికే తారక్ బెస్ట్ రికార్డును తిరగరాసింది. ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం అరవింద $721 ,077 కలెక్షన్స్ సాధించింది. సాయంత్రం లోపు టోటల్ ప్రీమియర్ కలెక్షన్స్ $825,000 నుండి $850,000 వరకు ఉండొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇది తారక్ కెరీర్ లో ది బెస్ట్ ‘యూ.స్. ప్రీమియర్ రికార్డు’. అరవింద సమేత కి ముందు, జై లవ కుశ $589,000 కల్లెక్షన్స్ తో ఎన్టీఆర్ బెస్ట్ రికార్డుగా ఉండేది. వీకెండ్ లో విడుదల కానప్పటికీ, యూ.స్. లో వచ్చిన రెస్పాన్స్ చుస్తే ఎన్టీఆర్డ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన సినిమాగా అరవింద సమేత రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories