“అరవింద సమేత” ఆల్బమ్ లో హైలైట్ గా నిలిచిన సాంగ్ ‘పెనివిటి.’ ఈ పాట లిరికల్ వీడియోను కూడా చాలా అద్భుతంగా, సందర్భోచితంగా విడుదల చేయడంతో, లిరికల్ వీడియోను చూడగానే ఎక్కేసింది. దీంతో ఈ పాట చిత్రీకరణపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి తాజాగా విడుదలైన ప్రోమో ఆడియోకు తగిన విధంగా లేదన్న నిరుత్సాహం వ్యక్తమవుతోంది.
లొకేషన్… తారక్ ఎక్స్ ప్రెషన్స్ కు వంక పెట్టాల్సిన పనిలేదు గానీ, ఈ పాట వినగానే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ లో వచ్చే సాంగ్ గా అనిపిస్తుంది, లిరికల్ వీడియో కూడా దాదాపుగా ఇలాంటి అనుభూతినే ఇచ్చింది. కానీ ఈ వీడియో ప్రోమోలో జూనియర్ ఎన్టీఆర్ ఆలపించడం కాస్త వినూత్నమైన అనుభూతిని పంచింది. నేరుగా ఇదే పాటను సిల్వర్ స్క్రీన్ పై చూస్తే ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ వచ్చేదో తెలియదు గానీ, ప్రోమోతో మానసికంగా ఫిక్స్ చేసారు.
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



