ముఖాన్ని ‘బ్లర్’ చేయాలని తెలియదా?

Arhaan Singh Mother fires on anushka sharmaరోడ్డుపై చెత్త వేశాడన్న ఆరోపణలపై అనుష్కతో తిట్లు తిన్న అర్హాన్ సింగ్ తల్లి జరిగిన ఘటనపై స్పందిస్తూ కోహ్లీ, అనుష్కల తీరును తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టును పెడుతూ…. శుభ్రత పేరిట వారిద్దరూ చీప్ పబ్లిసిటీని కోరుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు. వారిద్దరికీ కోట్లాది మంది అభిమానులు ఉన్నారని, వారి నుంచి తన కుమారుడికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఓ వ్యక్తి ప్రైవసీని దెబ్బతీయడం ఏంటని, వీడియో పోస్టు చేసే సమయంలో ముఖాన్ని బ్లర్ చేయాలని తెలీదా? అంటూ నిప్పులు చెరిగారు.

ఒక వ్యక్తికి ఉన్న ఇమేజ్ ని దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారని, మైదానంలో, సినిమా తెరపై వారు సెలబ్రిటీలు కావచ్చుగానీ, రోడ్డుపైకి వస్తే సాధారణ ప్రజలతో సమానమని, వారు గొంతెత్తే ముందు, పర్యవసానంగా తలెత్తే ఎదుటి వారి పరిస్థితిని కూడా ఆలోచించాలని సూచించారు. తన కుమారుడి వీడియోను పోస్టు చేయడం ద్వారా అతన్ని ప్రమాదంలో పడేశారని ఆరోపించారు. అనుష్క, కోహ్లీ చర్యల వల్ల తన కుమారుడి గోప్యతా హక్కుకు భంగం వాటిల్లిందని అన్నారు. ఈమె వాదనలోనూ వాస్తవం లేకపోలేదు అంటూ స్పందించడం నెటిజన్ల వంతు!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories