అర్జున్ చక్రవర్తి టీజర్‌: హిట్ వైబ్ కనిపిస్తోందిగా

arjun-chakravarthy-teaser-buzz

ఈ రోజుల్లో చిన్నా, మీడియం సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఒకే ఒక్క మార్గం – కంటెంట్‌లో దమ్ము ఉండాలి. విజువల్స్‌, స్టార్ పవర్లు తక్కువైనా, కథ, కథనంలో బలముంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయని ఎన్నోసార్లు రుజువైయింది. తాజాగా విడుదలైన ‘అర్జున్ చక్రవర్తి’ టీజర్ లో అలాంటి హిట్ వైబ్ కనిపించింది.

విజయ రామరాజు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ చూసిన ప్రతి ఒక్కరిలోనూ ‘సినిమాలు మేటర్ ఉంది’ అనే ఫీలింగ్ కలుగుతోంది.

ADVERTISEMENT

కబడ్డీ నేపథ్యంలో నడిచే ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా1980ల కాలాన్ని తెరమీదకు మళ్లీ తీసుకురావడమే కాకుండా, కథలోని ఎమోషన్ మనసుని తాకింది.

విజయ రామరాజు స్క్రీన్ ప్రెజెన్స్, డెడికేటెడ్ పెర్ఫార్మెన్స్ టీజర్ లో మేజర్ హైలెట్. అర్జున్ చక్రవర్తి పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

నిజ జీవిత కథ ఆధారంగా చూపించిన ప్యాషనేట్ నేరేషన్, సినిమాటోగ్రఫీలో నేటివిటీ టచ్, స్టైలిష్ ప్రెజెంటేషన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఎమోషనల్ హైస్.. ఇవన్నీ టీజర్ ని చాలా స్పెషల్ గా మలిచాయి.

డైరెక్టర్ విక్రాంత్ రుద్ర, నిర్మాత శ్రీని గుబ్బల చాలా హానెస్ట్ గా ఈ సినిమాని రూపొందించారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. ప్రేక్షకులకు ఒక మంచి కథని చూపించాలనే తనప వారిలో కనిపించింది.

ఇది కంటెంట్ బేస్డ్ సినిమా మాత్రమే కాదు, మనసులో నిలిచిపోయే సినిమాని టీజర్ చూసిన వారి మాట.

ఇప్పటికే ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి చేసుకుంది. టీజర్ సినిమాపై మంచి అంచనాలని పెంచింది. త్వరలోనే ఈ సినిమా బిగ్ స్క్రీన్స్ పైకి రానుంది.

ADVERTISEMENT
Latest Stories