కేసీఆర్‌, ఓవైసీ తలాక్ చెప్పుకున్నారు కానీ ఒక్కసారే…

పదవి, అధికారం ఈ రెండు రాజకీయ పార్టీలను, వాటి నేతలను శాశిస్తుంటాయి. బెల్లం చుట్టూ ఈగలు ముసిరిన్నట్లే ఈ రెండూ ఉన్న పార్టీ, నేతల చుట్టూ అందరూ ప్రదక్షిణాలు చేస్తుంటారు. ఈ రెండు కోల్పోయిన మరుక్షణం అందరూ ఎలా వచ్చారో అలాగే మాయమైపోతారు.

ADVERTISEMENT

రెండున్నర దశాబ్ధాలపాటు తెలంగాణ రాజకీయాలను, పార్టీలను, ఇరుగు పొరుగు రాష్ట్రాలను కూడా శాశించిన బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉందిప్పుడు. ఇంతకాలం మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కేసీఆర్‌ జిగిరీ దోస్త్ జాబితాలో మొట్ట మొదటి స్థానంలో ఉండేవారు. అందుకే తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉంటే వాటిలో ఆయన పోటీ చేసే హైదరాబాద్‌ సీటుని ఆయనకే వదిలేసేవారు. కానీ ఈసారి ఆ సీటుని తమ కొత్త దోస్త్ బీఎస్పీకి అప్పగించేశారు.

అందుకు బలమైన కారణమే ఉంది. శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే అసదుద్దీన్‌ ఓవైసీ, రేవంత్‌ రెడ్డికి దగ్గరయ్యారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతానని కేసీఆర్‌ అంటుంటే, పడిపోకుండా 5 ఏళ్ళు కాపాడుతానని అసదుద్దీన్‌ ఓవైసీ ప్రామిస్ చేశారు. కనుక కేసీఆర్‌ కూడా అసదుద్దీన్‌ ఓవైసీ పోటీ చేసే హైదరాబాద్‌ ఎంపీ సీటుని బీఎస్పీకి అప్పగించేశారు.

అయితే అప్పుడూ కాస్త దూరం ఆలోచించిన్నట్లే చెప్పవచ్చు. ముస్లిం మతంలో భర్త భార్యతో విడిపోవాలనుకుంటే మూడుసార్లు ‘తలాక్’ చెప్పాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్‌, ఓవైసీలు ఒక్కసారే చెప్పుకున్నారు. కనుక పూర్తిగా విడిపోలేదు అలాగని కలిసి ఉన్నట్లు కాదు.

కేసీఆర్‌, ఓవైసీలు విధిలేని పరిస్థితులలో రాజకీయంగా తలాక్ చెప్పుకున్నప్పటికీ వారి మనసులు ఎప్పుడూ కలిసే ఉంటాయి. కనుక భవిష్యత్‌ మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంటుంది.

అందుకే హైదరాబాద్‌ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టకుండా, బీఎస్పీకి అప్పగించారు. అక్కడ బీఎస్పీ పోటీ చేసినా ఓవైసీని ఢీకొనలేదు. ఓడించలేదు. కనుక ఓవైసీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ డమ్మీ అభ్యర్ధిని నిలబెట్టిన్నట్లే భావించవచ్చు. కానీ ఎలాగూ ఓడిపోయే సీటే కనుక దానిని బీఎస్పీకి ఉదారంగా ఇచ్చేశారు. అంటే గాలికి పోయే పేలాలు కృష్ణార్పణం అన్నట్లన్న మాట!

శాసనసభ ఎన్నికలలో మాకు ఎవరితో పొత్తులు అక్కరలేదు… 119కి 100కి పైగా సీట్లు మేమే గెలుచుకుంటామని ప్రగల్భాలు పలుకుతూ, సీపీఐ, సీపీఎం పార్టీలను కాలితో తన్నేసిన కేసీఆర్‌, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో 17 ఎంపీ సీట్లలో రెండింటిని (హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌) బీఎస్పీకి ఇచ్చేశారు. దేనికంటే… దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందట. బడుగు బలహీన వర్గాల తరపున పోరాడేందుకు రెండు పార్టీలు చేతులు కలిపాయట!

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ చెప్పుకున్నప్పుడు, ఈ లౌకికవాదం ఏమైపోయిందో? తెలీదు. ఒకవేళ ఎన్డీయేలో చేరమని మోడీ, అమిత్ షాలు ఆహ్వానిస్తే, అప్పుడు కూడా కేసీఆర్‌ లౌకికవాదం అంటూ మడి కట్టుకొని కూర్చుంటారా లేక పరిగెత్తుకొని వెళ్ళి వారి పక్కన కూర్చుంటారా? అంటే సమాధానం అందరికీ తెలుసు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Are Paid Reviews Misleading OTT Audiences?

A film can have a weak trailer, little audience interest and still look like a…

19 minutes ago

AP Local Body Elections: Can CBN and PK Keep the Alliance United?

After the 2024 Assembly election victory, TDP, Jana Sena and BJP are preparing for their…

29 minutes ago