ఉత్కంఠభరితంగా ముగిసిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను విశేషంగా అలరించింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కనపరిచిన పోరాటపటిమ, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అంతర్జాతీయ మ్యాచ్ లలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తోన్న బంగ్లా టీం, పిల్ల చేష్టలకు కూడా లోటు చేయబోమని మైదానంలో చాటిచెప్తున్నారు.
[m9ad]
లక్ష్యచేధనకు బరిలోకి దిగిన టీమిండియా, శిఖర్ ధావన్ రూపంలో తొలి వికెట్ ను కోల్పోయింది. ధావన్ ఔటైన వెంటనే బౌలర్ నజ్ముల్ ఇస్లాం ‘నాగిని డాన్స్’ వేస్తూ మైదానంలో హల్చల్ చేసాడు. గతంలో ఇదే విధంగా వికెట్ కీపర్ రహీమ్ హంగామా చేయగా, నెటిజన్లు రహీంకు సరైన రీతిలో బదులిచ్చారు. తాజాగా ఇస్లాం వంతు వచ్చింది.
తొలి వికెట్ తీయగానే ఇక మ్యాచ్ బంగ్లాదే అనుకున్నాడో ఏమో గానీ, బంగ్లా టీం మార్క్ నాగిని డ్యాన్స్ ను ప్రదర్శించాడు. బహుశా టీం గెలిచి ఉంటే ఈ నాగిని డ్యాన్స్ కు ఒక అర్ధం వచ్చి ఉండేదేమో గానీ, ఆదిలోనే ప్రదర్శించిన ఈ షో అబాసుపాలైంది. దీంతో మ్యాచ్ ముగిసిన నాటి నుండి ఇస్లాం చేసిన నాగిని డ్యాన్స్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



