అసురన్ రీమేక్… అడ్డాలకే అవకాశం

Srikanth Addala Asuran Remakeధనుష్ నటించిన అసురన్ అనే సినిమాను విక్టరీ వెంకటేష్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సురేష్ బాబు, తమిళంలో నిర్మించిన కలైపులి తాను ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుల జాడ్యంపై ఒక నిమ్నజాతికి చెందిన సామాన్యుడి పోరాటం గురించి తీసిన ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.

ఈ సినిమాను తెలుగులో తియ్యడం అందులోనూ వెంకటేష్ వంటి సాఫ్ట్ హీరోతో తియ్యడం సాహసమనే అనుకోవాలి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాలను ఫైనల్ చెయ్యడం విశేషం. సాఫ్ట్ చిత్రాల దర్శకుడైన శ్రీకాంత్ అడ్డాలను ఈ సినిమాకు ఫైనల్ చెయ్యడం అంటే సాహసం అనే అనుకోవాలి. ఆయనను ఒక ఇంటర్వ్యూలో సురేష్ బాబు కంఫర్మ్ చేశాడు.

ADVERTISEMENT

ఈరోజు అధికారిక ప్రకటన రావొచ్చు. శ్రీకాంత్ అడ్డాల గతంలో వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పని చేశారు. చివరి సారిగా మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం అనే అట్టర్ ప్లాప్ సినిమా చేశాడు. ఆ తరువాత ఆయనకు అవకాశాలు రాలేదు. వెంకటేష్ ఇప్పటికే ఈ సినిమా కోసం ప్రేపరషన్ మొదలు పెట్టాడట.

వెంకటేష్ నటించిన వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉంది. అయితే సినిమా రిలీజ్ తేదీ ఎప్పుడు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే డిసెంబర్ 13న సినిమా విడుదల కాయం అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 13 రిలీజ్ అంటే పోటీ లేకుండా విడుదల కావొచ్చు.

ADVERTISEMENT
Latest Stories