47 ఏళ్ళ వయసులో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్..?

At 47, actress Shobana to get marriedనాలుగు భాషల్లో దాదాపుగా 200 సినిమాలలో నటించినా, గ్లామర్ కు దూరంగా నటనకు పరిధి ఉన్న పాత్రలను మాత్రమే పోషించిన హీరోయిన్ శోభన ఇప్పటికీ ‘కుమారి’ అన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే తన జీవితాన్ని నృత్యానికే అంకితం చేసిన శోభన, వైవాహిక జీవితానికి మాత్రం దూరంగా ఉండిపోయారు. అయితే 2001వ సంవత్సరంలో ఓ పాపను దత్తత తీసుకుని, ‘అనంత నారాయణి’ అని నామకరణం చేసుకుని పెంచుకుంటోంది.

అలాంటి శోభన త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు తనకు స్నేహితుడిగా మెలిగిన వ్యక్తినే శోభన పరిణయం ఆడబోతుందనేది ఈ వార్తల సారాంశం. అయితే దీనిపై ఇప్పటివరకు ఆమె కుటుంబ సభ్యులెవరూ స్పందించలేదు. అలాగే శోభన నుండి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2013లో ‘థీర’ అనే తమిళ సినిమాలో చివరగా నటించిన పద్మశ్రీ శోభన, ‘కుమారి’ నుండి ‘శ్రీమతి’ అవుతారో లేదో చూడాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories