అభివృద్ధి చెందుతున్న దేశంగా విదేశీ వ్యవస్థను మన దేశస్థులు ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంటారు. దానికి అనుగుణంగానే వివిధ దేశాల్లో పర్యటనలు చేసి, వారికి కావాల్సిన అంశాలను సునిశితంగా పరిశీలిస్తుంటారు. అయితే శనివారం నాడు హైదరాబాద్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.
ఆస్ట్రేలియన్ పోలీసు బృందం హైదరాబాద్ లోని అబిడ్స్ రోడ్డులో గల పోలీస్ స్టేషన్ కు విచ్చేసి, స్థానిక పోలీసుల విధి నిర్వహణ, పోలీసు వ్యవస్థ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ వి.బి.కమలాసన్ రెడ్డి, ఏసీపీ అబిడ్స్ డివిజన్ రాఘవేంద్ర తో సమావేశమయ్యారు. ఒక విదేశీ వ్యవస్థ మన తీరును పరిశీలిస్తుండడంతో దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
ADVERTISEMENT
ADVERTISEMENT



