“మళ్ళీ మీరే రావాలి”పై పవన్ కళ్యాణ్ కామెంట్స్!

awan Kalyan Comments on Malli Meere Raavaliఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు, టిడిపి కార్యవర్గం బలంగా ఉన్నటువంటి యుఎస్ వంటి దేశాలలో కూడా “మళ్ళీ మీరే రావాలి” అన్న నినాదంతో కూడిన హార్డింగ్స్ వెలిసాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల వరకు జరగనున్న ఈ టిడిపి కాంపెయిన్ పై, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కామెంట్స్ చేసారు.

ADVERTISEMENT

[m9ad]

“ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మీరే రావాలి అని ముఖ్యమంత్రి గారి హార్డింగ్స్ చూస్తున్నాను, ఎందుకు రావాలి ఇలాంటి ఆకు రౌడీలను ప్రజల మధ్యకు వదలడానికా?” అంటూ చంద్రబాబుపై వీరలెవల్లో విమర్శల వర్షం కురిపించారు. భావోద్వేగాలను అణచుకోలేని పవన్, ఒకానొక సమయంలో నక్సల్స్ ను వెనుకేసుకొచ్చే డైలాగ్ లను కూడా వదిలారు.

‘ఎక్కువ దారుణాలు చేస్తే నక్సలైట్లు చంపక ఏం చేస్తారు, ప్రజల మీద రౌడీయిజం చేస్తే నక్సల్స్ అలా చంపుతూనే ఉంటారు’ అంటూ నక్సల్స్ తీరును సమర్ధించిన పవన్, ఆ వెంటనే నాలుక కరుచుకుని, ‘అలా అని నేను నక్సలైట్లు చేసిన దానిని సమర్ధించట్లెదు, మీ దోపిడీలు తప్పని చెప్తున్నా’ అంటూ సరిచేసుకునే ప్రయత్నం చేసారు.

ADVERTISEMENT
Latest Stories