సూర్య “24” టీజర్ చాలా ‘థ్రిల్లింగ్’గా ఉంది!

Suriya confirmed 24 teaser date‘మనం’ సినిమాతో తన ప్రతిభను చాటిచెప్పిన దర్శకుడు విక్రం కుమార్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం “24.” తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కొన్ని పోస్టర్స్ మాత్రమే విడుదలయ్యాయి. అయితే కేవలం పోస్టర్స్ తోనే భారీ హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు టీజర్ 4వ తేదీ సాయంత్రం విడుదల చేయబోతున్నట్లుగా ఒక అధికారిక పోస్టర్ ను విడుదల చేసారు.

అయితే ఈ టీజర్ ను బి.ఎ.రాజు వంటి సినీ ప్రముఖులు కొందరు ఇప్పటికే వీక్షించి, ట్విట్టర్ ద్వారా తమ అనుభూతులను పంచుకున్నారు. “సూర్య – విక్రం కుమార్ కాంభినేషన్ లో ఒక కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్ ని చూడబోతున్నాం” అని ట్వీట్ చేసి, టీజర్ పై అంచనాలు మరింతగా పెంచారు బిఎరాజు. ఒక్క రాజు గారే కాదు, సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు “24” టీజర్ పై ఇదే రకమైన భావాలను పంచుకున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories