2000 కోట్ల క్లబ్ లో “బాహుబలి 2” పక్కానా?

Baahubali 2 movie  in 2000 Crores Clubతెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన “బాహుబలి 2” సినిమాకు ప్రేక్షకులు ఎక్కడికక్కడ జననీరాజనం పలికిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 1200 కోట్లను తన ఖాతాలో వేసుకున్న ‘బాహుబలి 2’ తదుపరి దండయాత్ర చేయడానికి సిద్ధమవుతోంది. ఇందుకు మంచి ఉత్సాహాన్ని అందించింది “దంగల్” సినిమా. అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 700 కోట్ల పైనే కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల చైనా మార్కెట్ లో విడుదలై, అక్కడ కూడా దుమ్ము దులుపుతోంది.

ADVERTISEMENT

కనివినీ ఎరుగని విధంగా ఏకంగా 200 కోట్లను దాటిపోవడం ట్రేడ్ పండితులనే విస్మయానికి గురి చేస్తోంది. చైనా మార్కెట్ లో ఆల్ టైం నెంబర్ 1 సినిమాగా రికార్డు సాధించిన ‘దంగల్,’ రెండవ వారంలో కూడా తన హవాను కొనసాగిస్తోంది. శుక్రవారం నాడు 39.42 కోట్లు (ఇండియన్ కరెన్సీలో) వసూలు చేయడంతో, ఇప్పటివరకు చైనా మార్కెట్ లో 213..43 కోట్లు కొల్లగొట్టిందని స్పష్టం చేసారు. దీంతో మొత్తమ్మీద అమీర్ ఖాన్ “దంగల్” కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరడానికి ముహూర్తం ఖరారైంది.

‘దంగల్’ ఇచ్చిన ఈ ఉత్సాహంతో ‘బాహుబలి 2’ని కూడా చైనా భాషలోకి డబ్ చేయనున్నారు. నిజానికి ఈ ప్రతిపాదన ముందే ఉన్నప్పటికీ, ‘దంగల్’ కలెక్షన్స్ ‘బాహుబలి 2’కి మరో భారీ అవకాశాన్ని చూపించినట్లయ్యింది. ‘బాహుబలి’ పార్ట్ 1 కూడా చైనాలో విడుదలై ఆదరణను పొందిన విషయం తెలిసిందే. దీంతో త్వరలోనే చైనాలో కూడా విడుదల కానున్న ‘బాహుబలి 2’ టార్గెట్ కూడా ‘దంగల్’ కానుంది. మరి అక్కడ కూడా మన జక్కన్న మ్యాజిక్ కు ప్రేక్షకులు ఫిదా అవుతారో లేదో చూడాలి.

అదే జరిగితే ‘బాహుబలి 2’ 2000 కోట్ల క్లబ్ కు చేరువ అవుతుందా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం దేశ విదేశాల్లో సందడి చేస్తోన్న ‘బాహుబలి 2’ మొత్తమ్మీద 1500 కోట్లకు దగ్గరగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే చైనా మార్కెట్ నుండి ‘దంగల్’ను అధిగమించేలా 300 కోట్ల క్లబ్ లో చేరితే గనుక, మొత్తం 1800 కోట్లకు చేరుకుంటుంది. ఒక్క చైనానే కాకుండా, జర్మన్ తదితర దేశాలలో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్న నేపధ్యంలో… ఆ దేశాల నుండి మరో 200 కోట్లు రాబట్టగలిగితే… ఓవరాల్ గా “బాహుబలి 2” 2000 కోట్ల క్లబ్ ను లిఖించే అవకాశం లేకపోలేదు అంటున్నారు ట్రేడ్ పండితులు.

ADVERTISEMENT
Latest Stories