బాహుబలి 2’ అధికారిక ప్రకటన

rajamouli to watch rudramadevi today‘బాహుబలి’ విడుదలైన కొన్ని రోజుల్లోనే రెండవ పార్ట్‌ చిత్రీకరణ ప్రారంభించాల్సి ఉంది. కాని ఏవో కారణాల వల్ల రెండవ పార్ట్‌ చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం రెండవ పార్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌తో జక్కన్న బిజీగా ఉన్నాడు. ఇప్పటి వరకు రెండవ పార్ట్‌ అప్పుడు, ఇప్పుడు ప్రారంభం కాబోతుంది అంటూ మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. కాని చిత్ర యూనిట్‌ మాత్రం క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే తాజాగా రాజమౌళి మీడియాతో మాట్లాడిన సందర్బంగా ‘బాహుబలి 2’పై ఒక అధికారిక ప్రకటన చేశాడు.

రాజమౌళి మాట్లాడుతూ.. కొన్ని కారణాల వల్ల ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ‘బాహుబలి 2’ ఆలస్యం అయ్యిందని, ఇంకా ఆలస్యం చేయబోవడం లేదని, డిసెంబర్‌ 14న ప్రారంభించనున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇప్పటికే రెండవ పార్ట్‌ 40 శాతంకు పైగా చిత్రీకరణ పూర్తి అయ్యింది. మిగిలిన బ్యాలన్స్‌ షూటింగ్‌ను 180 రోజుల్లో పూర్తి చేసేలా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మొదటి పార్ట్‌లో నటించిన వారితో పాటు మరి కొందరు కొత్త నటీ నటులు కూడా కనిపించే అవకాశాలున్నాయి. రెండవ పార్ట్‌ వచ్చే సంవత్సరం డిసెంబర్‌లో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం అయితే సినిమా కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్‌ ఉంది.

ADVERTISEMENT
Latest Stories