అదే జరిగితే ‘బాహుబలి 2’ ఖాతాలో 2500 కోట్లు!

Baahubali-2-Dangal-collectionsఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను “బాహుబలి 2” తిరగరాస్తోంది అన్నది పాత మాట. ఇండియాలో ఉన్న అన్ని ప్రధాన రికార్డులను ‘బాహుబలి 2’ అధిగమించింది అన్న విషయం తెలిసిందే. ‘ఖాన్’ హవాకు బ్రేకులు వేసే విధంగా సాగిన ఈ కలెక్షన్ల పరంపర కొనసాగుతున్న సమయంలోనే… మరో వైపు చైనాలో అమీర్ ఖాన్ “దంగల్” సినిమాను విడుదల చేసారు. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను ‘బాహుబలి 2’ ఎలా తిరగారాస్తుదో, చైనాలో ఇండియన్ సినిమాలకు సరికొత్త టార్గెట్ ను సెట్ చేస్తోంది “దంగల్.”

అవును… బహుశా “బాహుబలి 2” చైనాలో విడుదలైనా కొడుతుందో లేదో గానీ, అమీర్ ఖాన్ “దంగల్” ఊహలకందని రీతిలో చైనా ప్రేక్షకుల ఆదరణను చూరగొంటోంది. తొలుత 200 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయినపుడు… ఆహా అన్నారు. ఆ తర్వాత 300, 400… తాజాగా 500 కోట్ల క్లబ్ లోకి ఎంటరై అందర్నీ అవాక్కు చేసింది. ఒక రకంగా బాలీవుడ్ సింగిల్ మార్కెట్ లో “బాహుబలి 2” 500 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించడం ఎంత అపూర్వ విజయమో, ‘దంగల్’ చైనా మార్కెట్ లో 500 కోట్లను కలెక్ట్ చేయడం అంతకు మించిన విజయంగా భావించాలి.

ADVERTISEMENT

‘బాహుబలి 2’ కూడా త్వరలో చైనా మార్కెట్ లో విడుదల కావడం తధ్యం అయిన నేపధ్యంలో “దంగల్” మాదిరే, ఈ సినిమా కూడా వసూళ్లు సాధిస్తే… 2000 కోట్లు అన్నది మంచినీళ్ళ ప్రాయం. అంతేకాదు, అంతకుమించి 2500 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించినా ఆశ్చర్యపడనవసరం లేదు. మరి “దంగల్” రికార్డులను ‘బాహుబలి 2’ అందుకోగలుగుతుందా? అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే! చూడబోతుంటే ‘దంగల్’ ప్రస్థానం ఈ 500తో ఆగిపోయేలా లేదు, మరో 100, 200 కోట్లు జోడించినా ఆశ్చర్యపోనవసరం లేదు అనే విధంగా సాగుతోంది.

ADVERTISEMENT
Latest Stories