ఆ అకౌంట్ లో “బాహుబలి” స్థానం 3!

Top Google Searches Baahubali, Top Google Searches Baahubali 3rd Position, Top Google Searches Baahubali 3rd Rank, Top Google Searches Baahubali Recordగడిచిన దశాబ్దపు కాలంలో ‘గూగుల్’లో అత్యధికంగా నెటిజన్లు వెతికిన సినిమాల జాబితాలో టాప్ స్థానాన్ని అమీర్ ఖాన్ “పీకే” దక్కించుకుంది. ఇక, రెండవ స్థానంలో విద్యాబాలన్ “కహాని” సినిమా నిలువగా, గతేడాది విడుదలై ఇండియన్ సినిమా రికార్డులను కొల్లగొట్టిన రాజమౌళి సృష్టి “బాహుబలి” మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీనికి సంబంధించిన జాబితాను గూగుల్ తాజాగా విడుదల చేసింది.

ఇక, హీరోల విషయానికి వస్తే… ‘హర్యానా కా షేర్’ సుల్తాన్ ఈ విభాగంలో కూడా తన ఆధిపత్యానికి అడ్డు లేకుండా కొనసాగుతున్నాడు. వరుస విజయాలతో తనకు ఎదురు లేదనే విధంగా దూసుకెళ్తున్న సల్మాన్ గురించే గడిచిన పదేళ్ళ కాలంలో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసారు. హీరోయిన్ల జాబితాలో అయితే ‘పోర్న్ బ్యూటీ’ సన్నీ లియోన్ టాప్ స్థానంలో నిలిచింది.

ADVERTISEMENT

ఇక డైరెక్టర్స్ అంశంలో… కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ ప్రభుదేవా గురించి వెతుకులాట జరుగగా, కరణ్ జోహార్, ఫర్హాన్ అక్తర్ లు తదుపరి స్థానాలలో నిలిచారు. సింగర్స్ విభాగంలో హనీ సింగ్ ఇండియన్ నిలువగా, అమితాబ్ & రేఖను ‘క్లాసిక్ యాక్టర్’ మరియు ‘క్లాసిక్ యాక్ట్రెస్’ కేటగిరిలుగా పరిగణించారు.

ADVERTISEMENT
Latest Stories