మార్కెట్ లో ‘బాహుబలి’ పాన్ మసాలా పాకెట్స్!

దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘బాహుబలి’ సినిమాను ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వినియోగించుకుంటున్నట్లుగా కనపడుతోంది. కొంత కాలం క్రితం వరకు పిల్లలు ఇష్టపడే తినుబండారాలు ‘బాహుబలి’ చిప్స్ పాకెట్స్ వంటివి మార్కెట్లో ఎక్కువగా సందడి చేసాయి. తాజాగా ఈ జాబితాలో పాన్ మసాలా పాకెట్స్ కూడా చేరాయి.

మసాలా ప్రియులను ఆకట్టుకునేందుకు ‘బాహుబలి’ పేరుతో పాన్ మసాలా పాకెట్స్ ను రంగంలోకి దించి సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారస్తులు. జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాలను ఈ విధంగా ఉపయోగించుకోవడం ఇలాంటి వ్యాపారస్తులకు సాధారణ విషయమే. గతంలో ‘పోకిరి, జల్సా, గబ్బర్ సింగ్, శ్రీమంతుడు’ తదితర సినిమాలు కూడా ఇదే కోవలో చిరు మార్కెట్ లో సందడి చేసాయి.

ADVERTISEMENT

Baahubali Pan Masala packets

ADVERTISEMENT
Latest Stories