‘బాహుబలి’ స్నాక్ ప్యాకెట్స్ సందడి!

baahubali-snacksహిట్ సినిమాల ప్రభావం తెలుగు సినీ ఆడియన్స్ పై ఎలా ఉంటుందో మరోసారి చాటిచెప్పిన చిత్రం “బాహుబలి.” గత ఏడాది విడుదలైన ఈ సినిమా సాధించిన అఖండ విజయం గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చిన్న పిల్లలను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమాను పూర్తిగా వినియోగించుకునేందుకు వ్యాపారస్తులు కూడా తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు.

ఇటీవల జరిగిన సంక్రాంతి పండుగ సందర్భంలో ‘బాహుబలి’ పోస్టర్లతో కూడిన గాలిపటాలను రూపొందించి పిల్లలను ఆకట్టుకున్న వ్యాపారస్తులు, తాజాగా ‘బాహుబలి’ స్నాక్ ప్యాకెట్స్ ను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు. అయిదు రూపాయల విలువుండే ఈ ప్యాకెట్ లో ఒక ఉచిత బహుమానం కూడా ఉందంటూ పిల్లలను ఊరించే ప్రయత్నం చేస్తున్నారు.

ADVERTISEMENT

నిజానికి ఇలాంటి ప్యాకెట్లు మార్కెట్ లోకి కొత్త కాదు. “పోకిరి” సినిమా నుండి ప్రారంభమైన ఈ ప్యాకెట్ల వెల్లువలో ‘శివాజీ, గబ్బర్ సింగ్, మగధీర, సింహా, అత్తారింటికి దారేది, లెజెండ్, రేసుగుర్రం’ వంటి ప్రజాదరణ పొందిన సినిమాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ వరకు పరిశీలిస్తే, వారి అభిమానులకు కొత్త అనుభూతులను పంచుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories