ఈ హాట్ ట్రైలర్ కూడా మోత మోగించిందిగా!

Babu Baga Busy Trailer Talk 4 Million Viewsబాలీవుడ్ హాట్ అండ్ హిట్ మూవీ “హంటర్” సినిమాను తెలుగు “బాబు బాగా బిజీ” పేరుతో రీమేక్ చేసిన వైనం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ కు వీక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడం విశేషం. అవసరాల శ్రీనివాస్ వంటి ఒక సాధారణ హీరోను పెట్టుకుని, కేవలం 4 రోజుల్లోనే 4 మిలియన్ (40 లక్షల) క్లిక్స్ ను అందుకోవడం విశేషం.

దీంతో ఈ సినిమాపై యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ఈ యూ ట్యూబ్ క్లిక్స్ చెప్పకనే చెప్తున్నాయి. ఉత్తరాది భామ మిస్తి చక్రవర్తితో పాటు తెలుగు ముద్దుగుమ్మలు తేజశ్విని, శ్రీముఖిలు నటించడం, అందులోనూ హాట్ హాట్ సీన్లకు కొదవలేదన్న ఇండస్ట్రీ టాక్ తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అమాంతం క్రేజ్ పెరిగింది. ఆ ప్రభావమే యూ ట్యూబ్ క్లిక్స్ రూపంలో కనపడుతోంది. ఓ చిన్న సినిమాకు నాలుగు రోజుల్లో 4 మిలియన్ క్లిక్స్ అంటే సాధారణ విషయం కాదు కదా మరి!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories