రాజమౌళి, ప్రభాస్ ల “బాహుబలి” ఇంకా తన సత్తా చాటుతూనే ఉంది. ఎవరో ఒకరు, ఏదోక విధంగా ఈ సినిమాను గుర్తు చేస్తూనే ఉన్నారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కవాతులో “బాహుబలి” వీరాభిమాని ఒకరు అదే టైప్ లో చేతిలో శివలింగం పట్టుకుని బైక్ మీద నిలబడి చక్కర్లు కొట్టాడు. చాలామంది ఈ ఫీట్ చూసి ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ప్రభాస్ కంటే మిన్నగా ఆయన అభిమాని చేసిన ఫీట్ ను నెటిజన్లు కొనియాడుతున్నారు. రీల్ లైఫ్ లో ప్రభాస్ ఇరగ్గోడితే, రియల్ లైఫ్ లో ‘బాహుబలి’ అభిమాని కుమ్మేసాడని కితాబిస్తున్నారు.
ఇక బాహుబలి కన్ క్లూజన్ విషయానికొస్తే, షూటింగ్ కేరళ అడవుల్లో నిర్విరామంగా సాగుతోంది. అక్కడి గిరిజనులు మొదట షూటింగ్ కు అడ్డు చెప్పినా దర్శకుడు రాజమౌళి వాళ్ళను ఎలా కన్విన్స్ చేశాడో తెలీదు గానీ మొత్తానికి మళ్ళీ స్టార్ట్ అయింది.





