‘అఖండ’తో మారిన ‘టీడీపీ’ ఫేట్!

balakrishna-akhanda-changes-tdp-fateనందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన “అఖండ” అమోఘమైన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఫస్ట్ వీకెండ్ తర్వాత ‘అఖండ’ హంగామా ముగిసిపోతుందని భావించిన వారికి షాక్ ఇచ్చే విధంగా, వీక్ డేస్ లో కూడా ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతుండడం తెలుగు ఇండస్ట్రీకి శుభపరిణామం. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో ఫ్యామిలీ ప్రేక్షకులు తరలి రావడం అనేది “అఖండ” సక్సెస్ కు కొలమానంగా చెప్పవచ్చు.

ఈ విజయం బాలకృష్ణ సినీ అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ వర్గాలను కూడా నూతన ఉత్సాహంలో నింపింది. అందులోనూ ప్రత్యర్థి పార్టీ ప్రతికూలంగా తీసుకున్న షోల నియంత్రణ, టికెట్ ధరల నిర్ణయాలకు ఎదురొడ్డి మరీ భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో, తెలుగు తమ్ముళ్లు గత అయిదారేళ్లుగా లేనంత జోష్ లో ఉన్నారు.

ADVERTISEMENT

ఎమ్మెల్యే అయిన తర్వాత బాలకృష్ణ సొంతం చేసుకున్న ఫస్ట్ సక్సెస్ ‘అఖండ’ కావడం, అది కూడా జగన్ ప్రభుత్వ చర్యలను ప్రతిఘటిస్తూ కావడం… టిడిపి వర్గాల సంతోషానికి అసలు కారణాలు. “అఖండ” పట్ల తెలుగుదేశం వర్గాల ఆనందం ఇలా ఉంటే, అధికార పార్టీ అధినేత అవలంభిస్తున్న విధానాలతో టిడిపి క్యాడర్ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది.

గడిచిన కొన్ని నెలలుగా ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఓటీఎస్ వంటి సామాన్యులను ప్రభావితం చేసే పధకం మొదలుకుని, ప్రభుత్వ సేవకులుగా పనిచేసే ఉద్యోగస్తుల వరకు అందరూ ‘జగన్ సర్కార్’పై తీవ్రంగా మండిపడుతున్నారు.

సంక్షేమం పేరుతో ఇప్పటివరకు అప్పులు చేస్తూ ఖర్చు పెట్టిన వైనంతో ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా చెప్పుకోలేని స్థితిలోకి వెళ్లిపోయిందని పలువురు ప్రముఖులు ఇప్పటికే ప్రెస్ మీట్ లు నిర్వహించి చెప్పారు. రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిందన్న అంశాన్ని స్వయంగా వైసీపీ ఎంపీనే పార్లమెంట్ లో ప్రస్తావించి నిధులను మంజూరు చేయాలని వేడుకున్నారు.

ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, రేపు రాబోయే రోజుల్లో సంక్షేమం కూడా ఇవ్వలేని పరిస్థితికి ఏపీ సర్కార్ వస్తే, ప్రజల నుండి పెద్ద ఎత్తున తిరుగుబాటు జెండా ఎగరడం ఖాయమని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికలలో 23 సీట్లతో ప్రజా తీర్పు వచ్చిన తర్వాత కృంగిపోయిన తెలుగుదేశం పార్టీ వర్గాలకు జగన్ విధివిధానాలు పార్టీ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నాయి. మొత్తానికి ‘అఖండ’ రిలీజ్ తర్వాత ‘టిడిపి’ ఫేట్ మారినట్లు కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories