మోనార్క్ గా బాలయ్య?

Balakrishna Plans for for his next movie releasesలాక్డౌన్ కారణంగా మొదటి షెడ్యూల్ ముగిసిన వెంటనే నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఆగిపోయింది. బాలకృష్ణ 2019 లో మూడు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఒక విజయాన్ని నమోదు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఈ నటుడు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం తన అదృష్ట దర్శకుడు బోయపతి శ్రీనుతో జతకట్టారు. వీరిద్దరూ గతంలో రెండు బ్లాక్ బస్టర్లను (సింహ, లెజెండ్) అందించడంతో ఈ చిత్రంపై హైప్ మరియు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. గత రెండు సినిమాల లాగే ఈ సినిమాకు కూడా బోయపాటి ఒక పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నారట.

ADVERTISEMENT

ఈ సినిమా కోసం మోనార్క్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే షూటింగ్ మొదలు పెడతారు. అన్నీ కుదిరితే… 2021 సంక్రాంతికి సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే చిరంజీవి ఆచార్య సినిమాతో పోటీ పడే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో బాలయ్య సరసన ఒక కొత్త అమ్మాయి నటించే అవకాశం ఉంది. గతంలో బోయపాటి జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కేరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా రూపొందించనున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories