డాకు: థమన్ శివ తాండవమే…!

Daaku Maharaaj Thaman

సంక్రాంతి సీజన్ రావటం తో తెలుగింట సినిమా పండగ కూడా షురూ అయ్యింది. ‘గేమ్ ఛేంజర్’ అంటూ రామ్ చరణ్ ఈ గేమ్ ను స్టార్ట్ చేస్తే ఈ గేమ్ లో మహారాజ్ గా నిలవడానికి డాకు సిద్ధమయ్యారు.

డాకు మహారాజ్ మూవీ కి మాటాల్లేవ్…మాట్లాడుకోవడాల్ లేవ్…ఓన్లీ థమన్ బాదుడే అన్నట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో డాకు మహారాజ్ మూవీ కి రాజయ్యి కూర్చున్నారు సంగీత దర్శకుడు థమన్.

ADVERTISEMENT

ఈ మూవీ కి సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం కేవలం నందమూరి అభిమానులనే కాదు యావత్ సినీ అభిమానులను కూడా ఉర్రుతలూగించింది. సినిమా మీద ఆసక్తిని, అంచనాలను పెంచింది.

ఎప్పుడు భారీ భారీ మాస్ డైలాగ్స్ తో తనదైన స్టైల్ తో దుమ్ములేపే బాలకృష్ణ ఈసారి అందుకు భిన్నంగా సింపుల్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించారు. మొదట విడుదల చేసిన ట్రైలర్లో ఎవరు నువ్వు అంటే ‘మైకేల్ జాక్సన్’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ట్రయిలర్ కే హై లైట్ నిలిచింది.

ఇక రీసెంట్ గా విడుదల చేసిన సెకండ్ ట్రైలర్ లో ‘అందరు చదువులో మాస్టర్స్ చేస్తే, నేను చంపడంలో మాస్టర్స్ చేశా’…, మీరు అరిస్తే బార్కింగ్ అదే నేనెరిస్తే….అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ నందమూరి అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయి.

అలాగే బాలయ్య చెప్పిన ఈ డైలాగ్స్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లాయి థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. అఖండ తో మొదలైన బాలయ్య, థమన్ జర్నీ ప్రేక్షకులకు థియేటర్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. బాలకృష్ణ సినిమా అంటే థమన్ కు ఏమవుతుందో తెలియదు కానీ, చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం అనేలా తన మ్యూజిక్ తో ‘శివ తాండవం’ చేస్తున్నారు థమన్.

అఖండతో థియేటర్లలో మ్యూజిక్ బాక్స్ లు దద్దరిల్లి పోయాయి…ఈ సారి డాకు తో థియేటర్లలో సౌండ్ బాక్స్ లు తగలబడిపోతాయి..అంటున్నారు బాలయ్య ఫాన్స్. అలాగే బాలకృష్ణ అన్ స్టాపబుల్ లో సందడి చేసిన థమన్ ‘బక్కోడికి రజినీకాంత్, బండోడికి బాలయ్య’..ఇక మోతమోగిపోవాల్సిందే అంటూ చెప్పిన డైలాగ్ ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

చెప్పిన మాట ప్రకారమే థమన్ తన మ్యూజిక్ తో థియేటర్లను తగలబెట్టబోతున్నారా? అంటూ సోషల్ మీడియాలో డాకు ఫీవర్ నడుస్తుంది. మరి ఈ స్థాయి అంచనాలను అందుకుని డాకు సంక్రాంతి గేమ్ లో మహారాజ్ గా నిలవబోతుందా.? లేదా అనేది మరో రెండు రోజులలో తేలిపోనుంది.

ADVERTISEMENT
Latest Stories