థమన్ పై బాలయ్య హిలేరియస్ పంచ్!

Balakrishna-Hilarious Punch onThamanప్రస్తుతం “అఖండ” జోష్ లో ఉన్న చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది. దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో బాలకృష్ణ మరియు సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ లు పాల్గొన్న ఈ మీట్ లో బాలయ్య అన్న ఓ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘తగ్గిపోతే, కొంచెం ప్రయత్నిస్తే అయిపోవచ్చు హీరో’ అంటూ పక్కనే ఉన్న థమన్ ను ఉద్దేశించి బాలయ్య వేసిన పంచ్ కు, ‘అయ్యో’ అంటూ థమన్ చిరునవ్వులు చిందించారు. ఆ తర్వాత బాలయ్య కూడా బిగ్గరగా నవ్వేశారు. ‘అఖండ’ ఇచ్చిన కిక్ లో ఉన్న నందమూరి అభిమానులు బాలయ్య వేసిన హిలేరియస్ పంచ్ ను వైరల్ చేస్తున్నారు.

ADVERTISEMENT

‘నా తమ్ముడు రామ్ ఎక్కడ’ అంటూ నందమూరి రామకృష్ణ గురించి ఆరా తీస్తూ, ‘నా తమ్ముడు నా సెంటిమెంట్’ అని దర్శకుడు బోయపాటికి తెలిపారు బాలయ్య. ఒక్క అభిమానులే కాదు, “అఖండ” ఇచ్చిన కిక్ బాలకృష్ణలో కూడా స్పష్టంగా కనపడుతోంది. చాలా రిలాక్స్డ్ గా తనదైన శైలిలో కనపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories